పోరుమామిళ్ల:
పోరుమామిళ్ల పోలీస్ స్టేషన్ లో శుక్రవారం గణతంత్ర దినోత్సవ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేసినారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది అమరవీరుల త్యాగఫలమే ఈ గణతంత్ర దినోత్సవం వేడుక అన్నారు. 365 రోజులు సెలవులు లేకుండా విధులు నిర్వహించే ఏకైక డిపార్ట్మెంట్ పోలీసులు అని పేర్కొన్నారు. ఇటువంటి బాధ్యతమైన విధి నిర్వహణ కత్తి మీద సాము లాంటిదని పేర్కొన్నారు. అనంతరం విధి నిర్వహణలో మంచి ప్రతిభ కనపరచిన కానిస్టేబుల్, హోమ్ గార్డు లకు క్యాష్ రివార్డులు అందించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ చిరంజీవి, సబ్ ఇన్స్పెక్టర్ మల్లికార్జునరెడ్డి ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.