వైయస్సార్ విగ్రహావిష్కరణ లో డిప్యూటీ సీఎం అంజాద్ భాష
కడప అర్బన్
రాష్ట్ర ప్రజలల్లో జరగని ముద్ర వేసుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష తెలిపారు. సోమవారము కడప మార్కెట్ యార్డ్ లో వైయస్సార్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమం మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు గంగాదేవి, వైయస్సార్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బంగారు నాగయ్య ఆధ్వర్యంలో జరిగింది.కార్యక్రమానికి డిప్యూటీ సీఎం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవారికి రేషన్ కార్డులతో పాటు ఇంటి స్థలం, ఇల్లు నిర్మించడం ఆరోగ్యశ్రీ ద్వారా అనేక మందికి సేవలందించడం జరిగిందని ఆయన కోరారు. అనంతరం కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందక అనేక మంది పేదవారు మృత్యువాతం ఉండడంతో ఆ విషయాలు పాదయాత్రలో గమనించిన వైయస్సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజివ్ ఆరోగ్య శ్రీ పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.