ఏలేశ్వరం:-ప్రజాధనాన్ని నగర పంచాయతీ అధికారులు దుర్వినియోగం చేస్తే సహించేది లేదని మూడవ వార్డు కౌన్సిలర్ బదిరెడ్డి సత్య గోవింద్ బాబు అధికారులను హెచ్చరించారు. శనివారం చైర్ పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు బడ్జెట్ అంశాలు కౌన్సిల్ ముందుకు రాగా కౌన్సిలర్ గోవింద్ బాబు మాట్లాడుతూ 2024- 25 సంవత్సరానికి గాను మార్కెట్ మరియు కబేల ఆశీలు నిమిత్తం వేలంపాట ప్రచారానికి రూ 30000 బడ్జెట్లో కేటాయించడం పట్ల ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. కేవలం 2000 తో మైక్ లో ప్రచారం చేసినట్లయితే సరిపోతుందని అధికారులను సూచించారు. రానున్న శివరాత్రి సందర్భంగా ఏలేరు నది ఒడ్డు వద్ద స్త్రీలు బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక షెడ్లు నిర్మాణానికి రూ 50,000 కేటాయించడం పట్ల బదిరెడ్డి మాట్లాడుతూ శాశ్వత నిర్మాణాలు చేపట్టినట్లయితే ప్రతి సంవత్సరం తాత్కాలిక షెడ్లు నిర్మించాల్సిన అవసరం ఉండదు అన్నారు. తాత్కాలిక రక్షణ కూడా ఏర్పాటుకు బడ్జెట్లో రూ 70000 కేటాయించడంతో తాత్కాలిక రక్షణ గోడకు అంత ఖర్చు ఎందుకు అవుతుందని బదిరెడ్డి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.నగర పంచాయతీలో వర్కులకు టెండర్ ద్వారా ఖరారు అయిన కాంట్రాక్టర్లు ఆ పని పూర్తి చేయవలసిందిగా అంతే తప్ప టెండర్ ఖరారు అయిన తర్వాత కాంట్రాక్టు దారుడు టెండర్ను రద్దు చేసుకునే అవకాశం ఉండదు అన్నారు. నగర పంచాయతీ కార్యాలయమునకు 30 కుర్చీలు కొనుగోలు నిమిత్తం బడ్జెట్లో రూ 25000 కేటాయించడంతో దీనిపై గోవింద్ మాట్లాడుతూ మార్కెట్లో కుర్చీ విలువ 450 మించి లేదన్నారు. ఈ లెక్క ప్రకారం 30 కుర్చీలకు రూ 13,500 అవుతుందని మిగతా సొమ్ము ఎక్కడకి పోతుందని అధికారులను ప్రశ్నించారు. వీటన్నిటి పైన ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కౌన్సిలర్లు అలమండ చలమయ్య, దళి కిషోర్, ఎండగుండి నాగబాబు, కోణాల వెంకటరమణ, సుంకర హైమావతి, మసిరపు బుజ్జి, కమిషనర్ కే శివప్రసాద్, మేనేజర్ కే శ్రీనివాసరావు, టౌన్ ప్లానింగ్ అధికారి తదితరులున్నారు.