వి.ఆర్.పురం :ఓటు ప్రజాస్వామ్యానికి ప్రాణదారం, దేశ మనుగడకు మూలాధారం, ఓటంటే నీ వేలి కొనపై సిరా చుక్క కాదు, మీ చేతిలో ఉన్న బంగారు భవిష్యత్తు కూడా, భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్యం ప్రతి ఓటు ఒక మూల స్తంభం అని, తహశీల్దార్ ఎస్డి మౌలానా ఫాజీల్ అన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎస్ వి ఈ ఈ పీ యాక్టివిటీలో భాగంగా శనివారం మండల కేంద్రంలోని రేఖపల్లి సెంటర్లో పాడేరు కు చెందిన రాజారామ్, జయరాం కళాకారుల చే ” కళాజాత ” కార్యక్రమం నిర్వహించి, ఓటు యొక్క ప్రాధాన్యతను తెలియజేస్తూ ఓటర్లను, ప్రజలను చైతన్య పరిచారు. ఈసందర్భంగా తహశీల్దార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు శక్తివంతమైన హక్కు ఇవ్వబడింది ఓటు హక్కు, “ప్రజలు ప్రజల కోసం ప్రజలచేత” అనే ప్రజాస్వామ్య నినాదానికి ఓటింగ్ మూలస్తంభం అని, ఎన్నిక అనేది దేశ జనాభా దేశాన్ని సమర్థవంతంగా పాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ, ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకం, భారతదేశంలో 18 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తులందరూ తమ ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి ఎన్నికలలో ఓటు వేయడానికి అర్హులని అన్నారు. అందుకే ప్రతీ ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
