Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుప్రిజనరీ జగన్ విజన్ గురించి మాట్లాడడం ఎనిమిదో వింత

ప్రిజనరీ జగన్ విజన్ గురించి మాట్లాడడం ఎనిమిదో వింత

జగన్ సొంత చెల్లెలు నిలదీస్తున్నారు
బీసీలకు నెలకు 4000 పెన్షన్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
శ్రీ సత్య సాయి జిల్లా :రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తన సొంత చెల్లెలు షర్మిల సునీతలే పలు విషయాలపై నిగ్గు తేల్చాలని బహిరంగంగా నిలదీస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. గురువారం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన పెనుకొండ పట్టణంలో శంఖారావం సభలో ఆయన ప్రసంగించారు. వయసు వివేకానంద రెడ్డి హత్య విషయంలో వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని వివేకానంద రెడ్డి కూతురు సునీత గత కొన్ని సంవత్సరాలుగా డిమాండ్ చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించలేకపోయిందన్నారు కొంతకాలం సిబిఐ దర్యాప్తుకు మోకాళ్ళ అడ్డుద అన్నారు. 16 నెలలు జైల్లో ఉన్న జగన్ ఆంధ్ర ప్రదేశ్ విజన్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు . జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు విధ్వంసాలు తో కాలయాపన చేశాడ న్నారు మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడుతూ కాలం వెళ్ళబుచ్చాడన్నారు.
వైజాగ్ లో ప్యాలెస్ నిర్మించుకునేందుకు రాజధాని 4 పేరట నాటకాలు ఆడాడు అన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 20 లక్షలు ఉద్యోగాలు పూర్తి చేస్తామన్నారు నిరుద్యోగులకు ప్రతినెల 3000 రూపాయలు పెన్షన్ అందజేస్తామన్నారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. ప్రతినెల 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. రైతుకు ప్రత్యేక 20వేల రూపాయలు అందిస్తామన్నారు. ప్రతి తల్లికి మా వందనం మాతో ప్రత్యేక వేల రూపాయలు అందజేస్తామన్నారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పిస్తామన్నారు బీసీలకు శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అంద చేస్తామన్నారు

20 లక్షల ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పెనుగొండకు కియా పరిశ్రమ తీసుకువచ్చి వేలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు కృష్ణా జలాలను తీసుకొచ్చి పెనుకొండకు త్రాగునీరు అందించామన్నారు. పెనుకొండ నియోజకవర్గం లో 500 కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మించామన్నారు.
సైకో జగన్ ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకులు బీకే పార్థసారథి పై 15 కేసులు సవితపై పలు కేసులు అక్రమంగా బనయించారన్నారు తనపై కూడా జగన్ కచ్చకట్టి పలు హత్యాయత్నం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సైతం బనాయించారన్నారు కేసులకు తెలుగుదేశం పార్టీ భయపడే ప్రసక్తే లేదని ఆయన అన్నారు నియోజకవర్గంలో పరిటాల రవీంద్ర బి.కె పార్థసారథి సారథ్యంలో తెలుగుదేశం పార్టీ కంచుకోటగా నిలబెట్టారన్నారు 10 వందల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. గత ఎన్నికలలో పాలు ఇచ్చే ఆవును వదిలేసి తన్నే దున్నపోతును మీరు తెచ్చుకున్నారన్నారు. ఎన్నికలలో టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి సవితను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు తమ ప్రభుత్వం అధికారంలో రాగానే పెనుకొండను టూరిజం కేంద్రంగా ప్రకటిస్తామన్నారు. గతంలో ఆగిపోయిన కమ్యూనిటీ భవనాలు అంగన్వాడీ భవనాలు ప్రాథమిక పాఠశాలల భవనాలు రోడ్లు డ్రైనేజీలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిస్థాయిలో నిర్మిస్తామన్నారు.
ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా ఉచితంగా త్రాగినీటిని అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు సభలో జిల్లా టిడిపి అధ్యక్షులు బికె పార్థసారథి టిడిపి అసెంబ్లీ అభ్యర్థి సవిత మాజీమంత్రి నిమ్మల కిష్టప్ప ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లా పార్టీ పరిశీలకులు రవీంద్ర జనసేన నాయకుడు కుమార్ లు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article