Monday, April 21, 2025

Creating liberating content

సినిమాఫిబ్రవరి 2 నుంచి ఆహా ఫ్లాట్ ఫామ్ పై హారర్ థ్రిల్లర్ 'పిండం'

ఫిబ్రవరి 2 నుంచి ఆహా ఫ్లాట్ ఫామ్ పై హారర్ థ్రిల్లర్ ‘పిండం’

శ్రీరామ్ ప్రధానమైన పాత్రను పోషించిన ‘పిండం’ సినిమా ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి ‘రెడీ అవుతోంది. హారర్ థ్రిల్లర్ జోనర్లో కొనసాగుతుంది ఈ సినిమా. డిసెంబర్ 15వ తేదీన విడుదలైన ఈ సినిమా, ఈ జోనర్లో వచ్చిన ఇంట్రెస్టింగ్ సినిమాల కేటగిరిలో చేరిపోయింది. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ‘ఆహా’ ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించడానికి సిద్ధమవుతోంది.

‘ఆహా’లో ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ సినిమాకి సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించాడు. చిన్న బడ్జెట్ సినిమానే అయినా, అంతకు మించిన కంటెంట్ ను అందించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article