జిల్లా కలెక్టర్ వి విజయ్ రామరాజు
కడప బ్యూరో
స్పందన ద్వారా అందే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వి విజయ్ రామరాజు అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్లోని స్పందన హాలు నందు..ప్రజా ఫిర్యాదుల స్వీకరణ “స్పందన” కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి విజయ్ రామరాజు తోపాటు జేసీ జి.గణేష్ కుమార్, డిప్యూటీ కలెక్టర్ ప్రత్యూష హాజరై ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … ఫిర్యాదులకు అధికారులు.. క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారులకు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు నాణ్యమైన పరిష్కారాలను అందించాలని సూచిస్తూ.. అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు.
- *స్పందన ద్వారా.. ప్రజల నుండి అందిన విజ్ఞప్తులలో కొన్ని..:
1.కడప నగరంలో నివాసం ఉంటున్న బి. దానమ్మ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, శివానందపురంలో రెండు సెంట్లు ఇంటి స్థలం ఉందని అందుకు సంబంధించి ఇల్లు నిర్మించుకోవడానికి హౌసింగ్ లోన్ ఇప్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ వారికి స్పందనలో అర్జీ సమర్పించి యున్నారు.
2.అకంకాయ పల్లి వల్లూరు మండలానికి చెందిన వరికుంట వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి తన గ్రామంలో 8/45a డోర్ నెంబర్ లో ఇల్లు కలదని దీనికి పడమర భాగంలో ప్రభుత్వం పైప్ లైన్ వేయదలచిందని అందులో భాగంగా మా ఇంటి గోడ పైప్ లైన్ వేసే క్రమంలో పోతున్నదని ఇందుకు సంబంధించి విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని స్పందనలో అర్జీ సమర్పించి యున్నారు
- ముద్దనూరు మండలం ఆర్జేపల్లి గ్రామానికి చెందిన చిన్న సుబ్బన్న గారి నరసింహారెడ్డి అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానని, మా గ్రామంలో సర్వేనెంబర్ 173, 174లలో మాకు 3.89 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అందుకు సంబంధించి ఆన్లైన్లో 211 ఖాతా నెంబర్ యందు నమోదు చేయాలని సోమవారం జరిగిన స్పందన లో అర్జీ సమర్పించి యున్నారు.
4.ఎర్రగుంట్ల మండలానికి చెందిన మనబోటి బాల రాములు అనే వ్యక్తి కూలి పని చేసుకొని జీవనం సాగిస్తున్నానని, శాంతినగర్ లో ఇంటి స్టలం వుందని పి నాగార్జున రెడ్డి అనే వ్యక్తి మా స్థలాన్ని ఆక్రమించాడని,విచారణ జరిపి మాకు మా స్టలం ఇప్పించాలని సోమవారం జిల్లా కలెక్టర్ వారికి స్పందనలో అర్జీ సమర్పించనున్నారు.
ఈ కార్యక్రమంలో సిపివో వెంకట రావు, ఆర్ అండ్ బి ఎస్.ఈ. మహేశ్వర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఎస్ఈ శ్రీనివాస రెడ్డి, డిఆర్డీఏ పీడి ఆనంద్ నాయక్, ఆర్ డఖ్ల్యూఎస్ ఎస్ఈ వీరన్న, జిల్లా వ్యవసాయ అధికారి జేడీ నాగేశ్వరరావు, హౌసింగ్, డ్వామా పీడిలు కృష్ణయ్య, యదుభూషన్ రెడ్డి, డిఎమ్ హెచ్ ఓ డా. నాగరాజు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డా.రమాదేవి, ఎల్డిఎం దుర్గా ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.