గుండ్లకుంట శ్రీరాములు.
కడప సిటీ:ప్రకృతి వనరులను కబళిస్తు ఐదేళ్లుగా రాష్ట్రం సర్వనాశనం . మద్యంపై వచ్చిన ఆదాయాన్ని తాకట్టు పెట్టినవారు మధ్య నిషేధం ఎలా చేస్తారు?బటన్ నొక్కుడు కంటే బొక్కుడు ఎక్కువైందన ఆరోపణలు బోలెడు. పేదలకు, పెత్తందారులకు యుద్ధమని కల్లబొళ్ళు కబుర్లుచెప్పారు. ఫ్లోటింగ్ బ్రిడ్జి కట్టలేని వారు పోలవరం ఎలా కడతారని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గుండ్లకుంట శ్రీరాములు ఒక ప్రకటనలో వైకాపా ప్రభుత్వాన్ని తప్పు పట్టారు.. అవినీతి అనకొండ జగన్ రెడ్డి తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఏది కనపడితే దానిని ఆమాంతం మింగేసారన్నారు. మంచి, చెడు, న్యాయం, అన్యాయం అనే విచక్షణ మర్చిపోయి అధర్మాన్ని నాలుగు కాళ్లపై ఐదేళ్లపాటు రాష్ట్రంలో నడిపించారు. కొట్టుకుపోయిన ప్రాజెక్టు గేట్లు పెట్టలేని వారు కొత్తగా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టగలుగుతారా? సెక్రటేరియట్ ను తాకట్టు పెట్టిన వారు రాజధాని ఎలా నిర్మిస్తారు? జగన్ రెడ్డి నొక్కుతుంది బటన్ కాదు, ప్రజల పీక. ఎన్నికల ఘంటారావం మోగింది. ఓటు అనే వజ్రాయుధంతో రాక్షస సంహారం జరిపేందుకు ప్రజల సిద్ధమవుతున్నారు. అసుర సంహారం జరిగితేనే రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. ఊక దంపుడు ఉపన్యాసాలతో, బూటకపు మాటలతో ప్రజలను మభ్యపెట్టడానికి, మాయ చేయడానికి మరలా భస్మాసురుడు వస్తున్నాడని ప్రజలు ఆలస్యంగానైనా గుర్తించారు. కాబట్టి ప్రజలు విజ్ఞతతో ఆలోచించి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ సీట్లు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.