బ్రోకలీలో అధికం మొత్తంలో ఫైబర్ ఉండటంవల్ల జీర్ణ క్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది. కాలేయ జీవక్రియను నియంత్రిస్తుంది. దీనిలో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మంచివి. మన శరీరంలో ఊపిరితిత్తులు చాలా ముఖ్యమైన అవయవాలు. ఇవి దెబ్బతింటే శ్వాస తీసుకోవడం చాలా కష్టమవడంతోపాటు అతి తక్కువ సమయంలో మనిషి మరణానికి దగ్గరవుతాడు. ఇలా జరగకుండా ఉండాలంటే వాటిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. శరీరం నుంచి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించడానికి పనిచేస్తుంది కాబట్టి వీటిని ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఇందుకు సరైన ఆహారం తీసుకోవాలి. నీరు ఎక్కువగా తాగుతుండాలి. బ్రోకలీని ప్రతిరోజు తీసుకోవడంవల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. బ్రోకలీని ప్రతిరోజు తీసుకోవడంవల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి. చలికాలంలో ఇది చాలామంచిది. అలాగే మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. క్యారెట్ కూడా ఊపిరితిత్తులను బలంగా ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఏ, సి ఉన్నాయి. అలాగే ప్రతిరోజు దానిమ్మ పండు తినడంవల్ల రక్తాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఊపిరితిత్తులను శుభ్రంగా ఉంచుతుంది. పచ్చి బఠానీలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఇది శరీరంపై మెరుపును తేవడంతోపాటు అనేక వ్యాధులను తగ్గిస్తుంది.