29 రూపాయలకే కిలో భారత్ బియ్యం పథకం ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కర్తవ్య పద్ లో ప్రారంభించారు. ఈ బియ్యం ని మొదట విడతలో భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య , జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య, కేంద్రీయ బంధార్ విక్రయ కేంద్రాల వద్ద అమ్మనున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పట్లో ఈ బియ్యం బయట బహిరంగ మార్కెట్ లో దొరకకపోవచ్చు కానీ ఆన్లైన్ లో మాత్రం అందుబాటులో ఉన్నాయి. ఈ బియ్యాన్ని నాఫెడ్ అధికారిక వెబ్ సైట్ www.nafedbazaar.com లో కొనుగోలు చెయ్యొచ్చు. ఇది ఆన్లైన్ సైట్ అయ్యినప్పటికీ, ఇందులో కొనుగోలు చెయ్యాలంటే కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయ్యాక మీ అడ్రస్ ని పెట్టి ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లోనే ఈ బియ్యం మీ ఇంటి అడ్రస్ కి చేరుతుంది.