ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ భారత్ లో భారీ సంఖ్యలో ఖాతాలపై వేటు వేసింది. సమస్యాత్మకంగా ఉన్నట్టు గుర్తించిన 69 లక్షలకు పైగా ఖాతాలను వాట్సాప్ గత డిసెంబరులో నిషేధించింది. ఈ ఖాతాలు భారత కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త ఐటీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్టు వాట్సాప్ గుర్తించింది. 2023 డిసెంబరు 1 నుంచి 31వ తేదీ మధ్య 69,34,000 ఖాతాలపై వాట్సాప్ తొలుత ఆంక్షలు విధించింది. వాటిలో 16,58,000 ఖాతాలపై ఎలాంటి ఆంక్షలు లేకుండా, నేరుగా నిషేధం విధించింది. డిసెంబరులో వాట్సాప్ కు రికార్డు స్థాయిలో 16,366 ఫిర్యాదులు అందాయి.