చంద్రగిరి:
తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం,కూచువారిపల్లి( భీమవరం) అటవీ ప్రాంతంలో ఏడాది వయసు గల గున్న ఏనుగు కళేబరాన్ని కూంబింగ్ నిర్వహిస్తున్న ఫారెస్ట్ అధికారులు ఆదివారం ఉదయం గుర్తించారు. గత 20 రోజులుగా సుమారు 18 ఏనుగుల గుంపు యల్లంపల్లి పరిసర ప్రాంతాల్లో పంట పొలాలపై దాడులు చేస్తున్నాయి. ఏనుగులు పంట పొలాలపై దాడులు చేయకుండా నివారించేందుకు అటవీ శాఖ సిబ్బంది ఏనుగులను అడవి వైపు మళ్లించేందుకు కూంబ్లింగ్ నిర్వహించారు. ఈ కూంబ్లింగ్ నిర్వహణలో అటవీ సిబ్బంది భీమవరం అటుపి ప్రాంతంలో కూంబ్లింగ్ నిర్వహిస్తుండగా దుర్వాసన రావడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. సంఘటన స్థలంలో పది రోజులకు ముందు గున్న ఏనుగు మృతి చెందినట్లు గుర్తించి అటవీ శాఖ డీఎఫ్ఓ సతీష్ రెడ్డి, ఫ్లయింగ్ స్క్వాడ్ డీఎఫ్ శివకుమారులకు సమాచారాన్ని తెలియజేశారు. సమాచారం తెలుసుకున్న డి ఎఫ్ ఓ లు సతీష్ రెడ్డి, శివకుమార్లు ఉదయం 11 గంటల కు అటవీ ప్రాంతంలోకి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతి చెందిన గున్న ఏనుగు ఆ ఏనుగుల గుంపుకు చెందినదిగా ఫారెస్ట్ అధికారులు తెలిపారు. . తల్లి నుంచి విడిపోయి, ఆహారము తాగనీరు లేక గున్న ఏనుగు అనారోగ్యానికి గురై చనిపోయిందని డీఎఫ్వోలు నిర్ధారించారు. అనంతరం డి యఫ్ ఓలు గున్న ఏనుగును కలేభారాణి అటవీ ప్రాంతంలోనే పశు వైద్యాధికారులచే శవపరీక్ష నిర్వహించారు. అనంతరం గున్న ఏనుగు కళేబారాన్ని అడవిలోనే పంచనామా చేసి కాల్చివేశారు. మృతి చెందిన గున్న ఏనుగు ఎముకలను, చర్మాన్ని, అవయవాలను శాంపుల్స్ తీసుకొని పశు వైద్య విశ్వవిద్యాలయం ల్యాబ్ కు పంపించామని డీఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు. పోస్టుమార్టంకు సంబంధించి, పశు వైద్య విశ్వవిద్యాలయం ల్యాబ్ నుంచి నివేదికలు వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలియజేస్తామని తిరుపతి డిఎఫ్ఓ సతీష్ రెడ్డి తెలిపారు. ఈ పరిశీలనలో ఎఫ్ఆర్వో దత్తాత్రేయ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.