వేంపల్లె
మహిళ సాధికారత కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు అందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి అన్నారు. కడప కు చెందిన శ్యామలమ్మ ను రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలిగా, వేముల నాగ రత్నను మహిళ కాంగ్రెస్ నగర అధ్యక్షురాలిగా, మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు తాతియా నియమించారు. ఈ నేపథ్యంలో వేంపల్లెలో ఆదివారం పదవులు పొందిన శామలమ్మ, నాగరత్న లకు పిసిసి మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల రాజకీయ, సాంఘిక, ఆర్థిక సాధికారత కోసం కాంగ్రెస్ ఎంతో చేసిందని చెప్పారు. బాలింతలకు, గర్భవంతులు,బాల బాలికల్లో పౌష్టికాహార లోప నివారణ కోసం 1975లోనే అంగన్వాడీ లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళా ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి పావలా వడ్డి, సున్నా వడ్డి, స్త్రీ నిధి పథకాలను ప్రవేశ పెట్టి మహిళాలను మహారాజులుగా చేసిందని చెప్పారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించి లక్షలాది మంది మంది మహిళలను రాజకీయ పదవులైన సర్పంచులుగా, ఛైర్మన్లుగా, మేయర్లుగా చేసిందని చెప్పారు. బాలికల బంగారు భవిష్యత్తు కోసం బంగారు తల్లి పథకాన్ని, గృహిణుల కోసం అమ్మ హస్తం పథకాలను కాంగ్రెస్ అమలు చేయడం జరిగిందని చెప్పారు. దురదృష్టవశాత్తు జగన్ ప్రభుత్వం బంగారు తల్లి పథకాన్ని, అమ్మ హస్తం పథకాలను రద్దు చేయడం జరిగిందని చెప్పారు. డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ పథకాన్ని 5 లక్షల నుంచి 3 లక్షలకు తగ్గించినట్లు చెప్పారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నట్లు చెప్పారు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయని తెలిపారు. కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలోకి వస్తే బంగారు తల్లి, అమ్మ హస్తం పథకాలను పునరుద్ధరణ చేస్తామని చెప్పారు. అలాగే ధరలు కూడ తగ్గించడం జరుగుతుందని చెప్పారు. రూ 500 కే గ్యాస్ సిలిండర్ ను అందజేస్తున్నట్లు చెప్పారు. పదవులు పొందిన మహిళలు కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం సైనికుడిగా పని చేయాలని పిలుపునిచ్చారు. నియామక పత్రాలు అందుకున్న మహిళాలు తులసిరెడ్డికి శాలువతో సత్కరించారు.