Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుమా జగనన్నే రాష్ట్రానికి శ్రీరామరక్ష!

మా జగనన్నే రాష్ట్రానికి శ్రీరామరక్ష!

  • హిందూపురం పురోభివృద్ధి మా ధ్యేయం
  • అవకాశం ఇస్తే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం
  • నేటి సీఎం జగన్ కార్యక్రమానికి తరలి రండి
    టిఎన్ దీపికా వేణు రెడ్డి

హిందూపురం
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శ్రీరామరక్షగా ఉంటారని స్థానిక వైకాపా ఇన్చార్జ్, హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి టిఎన్ దీపిక, వైకాపా నేత గుడ్డంపల్లి వేణు రెడ్డిలు పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే పరిపాలన విధంగా అన్ని విధాలా మన్నలను పొందిన వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రస్తుత ఎన్నికల్లో వైకాపా విజయం తద్యమన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి ఆ పార్టీ శాసనసభ్యులను గెలిపిస్తున్న నియోజకవర్గ అభివృద్ధి అంతంత మాత్రమే అన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి…. హిందూపురం నియోజకవర్గానికి మహర్దశ తెస్తామని హామీ ఇచ్చారు దీపికా వేణు రెడ్డి. ప్రస్తుత ఎన్నికల్లో తప్పనిసరిగా విజయం తమదేనని… నియోజకవర్గ అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆశీస్సులు తమకు ఉన్నందున హిందూపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా తాము పని చేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం 10:30 గంటలకు హిందూపురం కు విచ్చేస్తున్నారని…. నియోజకవర్గ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు, అభిమానులు… శ్రేయోభిలాషులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మాదిరి తాము వ్యవహరించమని… స్థానికంగా ఎల్లప్పుడూ ఉంటూ… హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సేవకు పాటు పడతామన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి… నియోజకవర్గ అభివృద్ధి ఏమిటో చేసి చూపిస్తామని దీపిక వేణు రెడ్డిలు చెప్పారు. కర్ణాటకకు సమీపంలో ఉన్న హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి పెద్ద ఎత్తున పరిశ్రమలను తీసుకువచ్చి వందలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంపై పూర్తిగా అవగాహన ఉందని, హిందూపురం పురోభి వృద్దే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను విజయవంతం చేసేందుకు వైకాపా నేత గుడ్డంపల్లి వేణు రెడ్డి నేతృత్వంలో పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article