మార్కాపురం:మార్కాపురం పట్టణం లోని స్థానిక సంచివాలయాల చుట్టూ నేటికీ మే నెల ప్రారంభమై 17 రోజులు గడిచినప్పటికి తమకు పింఛను సొమ్ము అందలేదని పలువురు అవ్వ తాతలు తిరుగుతున్నారు.వారి తరుపున సచివాలయం సిబ్బందిని ఎందుకు ఈరోజు వరకు పింఛను జమకాలేదని విచారించగా వారి ఖాతాలు రన్నింగ్ లో లేని కారణంగా ఆగాయని వారు తెలిపారు.పదో వార్డులో నివాసం ఉంటున్న కల్లూరి సాలమ్మ అనే పింఛను దారు ను అడుగగా మేము గత 15 రోజులనుంచి తిరుగుతున్నామని ఫించన్ వస్తుందో రాదో తెలియడం లేదని వాపోయారు.అసలు విషయం ఏమిటని పలువురు ఫించన్ దారులైన వృద్ధాప్య ,వితంతు ,దివ్యాంగులను ఆరా తీస్తే గతంలో ప్రభుత్వo చాలా సంవత్సరాల క్రితం ఫించన్ దారుల కోసం ప్రత్యేకంగా ఐ సి ఐ సి బ్యాంకుతో టై అప్ అయిఖాతాలను ఏర్పాటు చేసింది.అకౌంట్ నంబరు కానీ ,పాస్ బుక్ కానీ వారికి ఇవ్వకుండా ఒక కార్డును మంజూరు చేసింది. ఆ బ్యాంకులో ఖాతా వున్నట్టు ఎవరికీ తెలియదు.అవి రన్నింగ్ లో లేని కారణంగా మనుగడలో లేవు.కానీ ప్రభుత్వం గత నెలలో సచివాలయాల దగ్గర ఫించన్ సొమ్మును అందజేసారు.కానీ మే నెల ఫించన్ సొమ్మును బ్యాంక్ ఖాతాలో జమ చేయటం జరిగింది. దురదృష్టవశాత్తూ చాలా మంది ఫించన్ దారుల సొమ్ము మనుగడలో లేని ఐ సి ఐ సి బ్యాంకు లో వేయటం జరిగింది. ఈ విషయం తెలియని అవ్వ తాతలు ఫించన్ కోసం ప్రస్తుతం మనుగడలో వున్నవారి బ్యాంకుల చుట్టూ , సచివలయాల చుట్టూ తిరుగుతున్నారు.చివరకు ఐ సి ఐ సి బ్యాంకు దగ్గరకు వెళ్ళి విషయం చెపితే ఆ ఖాతా గురించి మాకు తెలియదని నెల్లూరు నుంచి సిబ్బంది వస్తారని అప్పుడు మేము మిమ్మలను పిలిపిస్తామని మీ ఫోన్ నంబర్ ఇవ్వందని చెప్పి పంపిస్తున్నారు.ఎన్నికల కారణంగా ఒకరి మీద ఒకరు చెప్పుకుని ఫించన్ ల కోసం చివరకు ఎండలకు తిప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని శాపనార్థాలు పెట్టడం గమనార్హం. ఎన్నికలు అయిపోయినవి కాబట్టి కనీసం జూన్ నెల ఫించన్ ను సకాలంలో సచివాలయంలో మా ఫించన్ ఇప్పించండి అంటూ వేడుకోవటం ఆశ్చర్యం కలిగించింది.ఇప్పటికైనా సంబంధిత అధికారులు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించి ఫించన్ దారుల కు ఐ సి ఐ సి బ్యాంకు ఉన్నతాధికారులతో సమీక్షించి మే నెల ఫించన్ సొమ్మును ఇప్పించి ఈ సమస్య పునరావృత్తం కాకుండా అండగా నిలవాలని అవ్వ తాతలు తరుపున ఆర్టీఐ ఎక్స్ ప్రెస్ కోరుతుంది