బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్ కేసులో మరో ట్విస్ట్ బయటకొచ్చింది. పంజాగుట్ట కేసుతో పాటు జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసు తెరపైకి వచ్చింది. ఈ కేసు వివరాలను వెస్ట్ జోన్ డీసీపీ పరిశీలిస్తున్నారు. 2022లో జూబ్లీహిల్స్ లో ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృత్యువాతపడ్డారు. ఆ సమయంలో రహీల్ ఆ కారులోనే ఉన్నాడు. అప్పట్లో అఫ్నాన్ అనే వ్యక్తి తానే కారు నడిపినట్లు పోలీసుల ముందు లొంగిపోయాడు. అఫ్నాన్ పక్కనే రహీల్ కూర్చున్నట్లు గతంలో కోర్టుకు పోలీసులు తెలిపారు. అయితే, ఈ కేసులో జూబ్లీహిల్స్ పోలీసులు సరైన ఆధారాలు సమర్పించలేదని గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఫింగర్ ఫ్రింట్స్ ఆఫ్నాన్ తో మ్యాచ్ అయినట్లు కోర్టుకు పోలీసులు తెలిపారు. కానీ, ఫింగర్ ఫ్రింట్స్ రిపోర్ట్, ఐదెంటిఫికేషన్ పేరెడ్ సరిగా జరగలేదని ప్రస్తుత దర్యాప్తు అధికారులు అభిప్రాయ పడుతున్నారు.గతేడాది డిసెంబర్ 25న తన ర్యాష్ డ్రైవింగ్ తో ప్రజాభవన్ గోడను మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ ఢీకొట్టాడు. అక్కడి నుంచి రహీల్ దుబాయ్ పరారయ్యాడు. రహీల్ కేసుకు సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పంజాగుట్ట కేసులో పోలీసులు పది మందిపై కేసు నమోదు చేశారు. గత సంవత్సరం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసు వివరాలపైనా కూపీలాగుతున్నారు. గతేడాది ర్యాష్ డ్రైవింగ్ కేసులో ఇద్దరు మరణించారు. కానీ, జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించినట్లు ఆరోపణలు రావడంతో మళ్లీ ఆ కేసును రీ ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. రహీల్ ఆ కేసులో ర్యాష్ డ్రైవింగ్ చేసి ఇద్దరు ప్రాణాలు తీసినప్పటికీ.. తనను తప్పించి ఆ కేసులో తన డ్రైవర్ గా ఉన్నటువంటి ఆఫ్నాన్ ను ఇరికించే ప్రయత్నం చేశారు. ఫింగర్ ప్రింట్స్ కు ఆప్నాన్ నిర్ధోషి అని చూపేలా మ్యాచ్ అయ్యాయని గతంలో జూబ్లీహిల్స్ పోలీసులు రిపోర్ట్ ఇచ్చినప్పటికీ.. ఆ ఫింగర్ ప్రింట్స్ కు సంబంధించి ఐడెంటిఫికేషన్ పేరెడ్ కు కొంత వ్యత్యాసం ఉందని ప్రస్తుతం పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.