ఈరోజుల్లో మానసిక ఒత్తిడి నుంచి బైటపడేందుకు యోగా, ధ్యానం వున్నప్పటికీ మనం తినే ఆహార పదార్థాలు కూడా అందుకు సహకరించేవిగా వుండాలి. అలాంటి 6 ఆహార పదార్థాలు ఏమిటో తెలుసుకుందాము. లెమన్, లేవండర్ తదితర హెర్బల్ టీలను తాగితే క్రమంగా ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు.యాంటిఆక్సిడెంట్లు కలిగి వున్న బ్లూబెర్రీలు తింటే మానసిక ఒత్తిడి నుంచి బైటపడవచ్చు.స్ట్రెస్ హార్మోన్లను తగ్గించి, ప్రశాంతతను కలిగించే ఫ్లేవనాయిడ్లు కలిగిన డార్క్ చాక్లెట్ తింటే ఒత్తిడి తగ్గుతుంది.జింక్, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి ఒత్తిడిని తగ్గించగలవి పొద్దుతిరుగుడు విత్తనాలు, గుమ్మడి విత్తనాలు, బాదములలో వుంటాయి. రక్తపోటును క్రమబద్ధీకరించగల పొటాషియం, మోనోశాచురేటెడ్ కొవ్వులు కలిగిన అవొకాడోలు తింటున్నా ఫలితముంటుంది.యాంటిఆక్సిడెంట్, యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన పసుపు తీసుకున్నా వత్తిడి సమస్యను వదిలించుకోవచ్చు.