- 8వ తేదీన స్వామి, అమ్మవార్ల కల్యాణం..
- వాల్ పోస్టర్లు ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..
చంద్రగిరి:
తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామి వారి మహా శివరాత్రి ఉత్సవ పోస్టర్లు, కర పత్రాలను ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఆలయ అధికారులు, అర్చక స్వాములు ఆదివారం ఆయన ఇంటి వద్దకు వెళ్లి స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం మార్చి 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగే మహా శివరాత్రి ఉత్సవాల పోస్టర్లను ఆవిష్కరణ చేశారు. అనంతరం స్వామి, అమ్మవార్ల బ్రహ్మోత్సవాలు సమాచారం ప్రతి గడపలో తెలియపరిచే విధంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి అధికారులను ఆదేశించారు. శివరాత్రి ఉత్సవాలు ప్రారంభ సమయానికి ఆలయం వద్ద అన్ని వసతులు కల్పించాలన్నారు. ఉత్సవాలలో ప్రధానమైన 8వ తేదీ శివరాత్రి పర్వదినాన జరిగే స్వామి అమ్మవార్ల కల్యాణ మహోత్సవంకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలన్నారు.