Tuesday, April 22, 2025

Creating liberating content

తాజా వార్తలుమిస్ టీన్ గ్లోబల్ ఇండియా 2024 విజేతగా సంజన వరద

మిస్ టీన్ గ్లోబల్ ఇండియా 2024 విజేతగా సంజన వరద

  • సంజనకు పలువురు అభినందనలు
  • ఇండియాకి వన్నెతెచ్చిందని కితాబు

తిరుపతి
‌‌‌

జైపూర్‌లో స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్‌కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా 2024 టైటిల్‌ను తిరుపతి జిల్లా చంద్రగిరి చెందిన అలత్తూరు మోహన్, పద్మవతి మనమరాలు, అలత్తూరు పావని సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద గెలుచుకొని భారతదేశం గర్వపడేలా చేసింది. ఈనెల 7 నుండి మే 12 వరకు మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్ 2024 పోటీలో భారతదేశానికి సంజన వరద ప్రాతినిధ్యం వహించింది. ఈపోటీలలో ఆమె 1వ రన్నరప్‌గా నిలిచింది. 18 సంవత్సరాల సంజన వరద బెంగూళూరులోని ఓ కళాశాలలో బె.టెక్ ద్వీతీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో ఈ అవార్డును గెలుచుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఒకటవ రన్నరప్ గా నిలిచి రికార్డు సృష్టించింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన పోటీలలో వివిధ దేశాలకు చెందిన యువతులు పాల్గొనగా అందులో నిలిచి భారతదేశం తరఫున రన్నరఫ్ గా కిరీటాన్ని అందుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతో పాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అవార్డు మరియు పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన ఫౌండేషన్, పిత్తా పౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో ఆమె గణనీయమైన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. 12 దేశాలకు చెందిన పోటీదారులతో పోటీ పడుతున్న సంజన వరద విజయం ఆమెకు, ఆమె కుటుంబానికి, యావత్ భారతదేశానికి గర్వకారణం.

పలు అభినందనలు
జైపూర్‌లో స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్‌కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా 2024 టైటిల్‌ను కైవసం చేసుకున్న సంజన వరదను‌ పలువురు అభినందించారు. ఈసందర్భంగా రాష్ట్రస్థాయి అధికారులు, నాయకులు, కుటుంబ సభ్యులు, బందువులు ఆమెను అభినందించారు. చంద్రగిరిలో ఓ సాదరణ కుటుంబంలో పుట్టిన సంజన వరద అంతర్జాతీయ స్థాయిలో రాణించడం గొప్పవిషయమని పలువురు చంద్రగిరి వాసులు వెల్లడించారు. మరంత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆశించారు.

మిస్ ఇండియానే నాలక్ష్యం
– సంజన వరద
అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరీటాన్ని సాధించడమే తమ ధ్యేయమని, దానికోసమే కష్టపడుతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహిత సంజన వరద అన్నారు. ఆమె మిడియా ప్రతినిధితో మాట్లాడుతూ ఇంకా‌కష్టపడి ఉన్నత స్థానానికి రావాలని అందుకే కష్టపడి చదువుతానన్నారు. నాకు స్టడీస్ ముఖ్యమని, తాను చేస్తున్న సేవా కార్యక్రమాలు ముఖ్యమన్నారు. సమాజ శ్రేయస్సుకు దోహదం చేస్తామని, పేద ప్రజలను ఆదుకుంటామని ఆమె‌వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article