ప్రొద్దుటూరు: వైఎప్పార్ కాంగ్రేస్ పార్టీ ప్రభుత్వంలో మీకు, మీ కుటుంబానికి మేలు జరిగి ఉంటేనే ఆదరించాలని ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని 36వ వార్డులో కౌన్సిలర్ అలవలపాటి అరుణాదేవి. అలవలపాటి పురుస్తోత్తం ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే రాచమల్లుతో పాటు ఆయన సతీమణి రాచమల్లు రమాదేవిలు పాల్గొన్నారు. వారికి రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అధారిటీ బోర్డ్ మెంబర్ కాకర్ల నాగశేషా రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి వెళ్లి తనను ఎమ్మెల్యేగా, ఎంపీగా అవినాష్ రెడ్డిని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పధకాలతో వార్డు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, వైకాపాకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన జగనన్నా సంక్షేమ పధకాలు ప్రతి గడవకు అందాయని అన్నారు. తదు వైకాపా ప్రభుత్వంలో నియోజకవర్గాన్ని అన్ని కలుగా ఆభివృద్ధి చేశామని అన్నారు.