Thursday, November 28, 2024

Creating liberating content

క్రీడలుముగిసిన తొలిరోజు ఆట.. ఇంగ్లాండ్‌ 302/7

ముగిసిన తొలిరోజు ఆట.. ఇంగ్లాండ్‌ 302/7

భారత్, ఇంగ్లాండ్ మధ్య రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌ 7 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. తొలి సెషన్‌లోనే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును జో రూట్ సెంచరీతో ఆదుకున్నాడు. ఇంగ్లాండ్‌ బ్యాటర్లలో రూట్‌ 106, బెన్‌ ఫోక్స్‌ 47, జాక్‌ క్రాలే 42, బెయిర్‌స్టో 38 పరుగులు చేశారు. భారత్ బౌలర్‌ ఆకాశ్‌ దీప్ 3 వికెట్లు పడగొట్టగా సిరాజ్ 2, అశ్విన్‌, జడేజా చెరో వికెట్‌ తీశారు.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్‌కు ఓపెనర్లు మంచి ఆరంభాంన్ని అందించారు. ఓపెనర్ జాక్ క్రాలే (42), బెన్ డకెట్(11) పరుగులు చేశారు. వీరు ఇద్దారు కలిసి 40 పరుగులు జోడించారు. ఆ తర్వాత భారత్ కు తొలి వికెట్‌ను బెంగాల్ యువ పేసర్ ఆకాష్ దీప్ అందించాడు. జాక్ క్రాలే వికెట్ పడగొట్టాడు. నెక్ట్స్ ఓవరలో డకెట్ ను కూడా పెవిలియన్‌కు పాంపడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ 2 వికెట్లు నష్టానికి 50 పరుగులు చేసింది. జో రూట్ క్రీజులో దిగాడు, జానీ బెయిర్ స్టో తో కలిసి నిలకడగా ఆడారు. ఈ ఇద్దారి భగ్యసమ్యంలో 70 పరుగులు ఇంగ్లాండ్ స్కోర్ బోర్డుకు జోడించారు. ఆ తర్వాత రూడ్ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ జోడి ప్రమందకంగా మరుతున్న సమయంలో రవిచంద్రన్ అశ్విన్ విడ్డాగొట్టాడు. బెయిర్ స్టో వికెట్ తీసుకున్నాడు. ఈ వికెట్ తో అశ్విన్ ఇంగ్లాండ్‌పై 100 వికెట్లు పూర్తి చేసుకున్నాడు. దీంతో అశ్విన్ రికార్డ నెలకొల్పాడు. భారత్ నుంచి ఇంగ్లాండ్ పై అత్యధిక వికెట్లు తీసిన ఫస్ట్ బౌలర్‌గా నిలిచాడు. జో రూట్( 226 బంతుల్లో 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ విఫలమైయ్యాడు. కేవలం మూడు పరుగులకే జడేజా బౌలింగ్‌లో వెనుదిరిగాడు. బెన్ ఫోక్స్, రూట్ తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఈ జోడి 50 పరుగులు జతాచేశారు. కాగా, ఫోక్స్(47) ను జడేజా అంద్భుతమైన బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత రాబిన్‌సన్‌(31)తో కలిసి రూట్ 40 పరుగులు జోడించారు. ప్రసుత్తం ఇంగ్లాండ్ మొదటి రోజు ఆట మొగిసే సమయనికి 7 వికెట్లు కొల్పొపోయి 302 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్(106), రాబిన్‌సన్(31) పరుగులతో ఉన్నారు. భారత్ బౌలర్లు ఆకాష్ దీప్ 3 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు, జడేజా, అశ్విన్ చారో వికెట్లు పడగొట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article