కనిగిరి
మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి కనిగిరి పురపాలక సంఘము అభివృద్ధికి కృషి చేయాలని మునిసిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. బుధవారం కనిగిరి పురపాలక సంఘం కార్యాలయం కౌన్సిల్ హాలు నందు మునిసిపల్ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అద్యక్షతన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సవరించిన బడ్జెట్ తో పాటు 2024 సంవత్సరం ఆదాయం, వ్యాయముల బడ్జెట్ గురించి ఆమోదించారు. 2024-25 సంవత్సరానికి రూ. 16,35,00,000.00 లు ఆదాయం రూ. 15,55,000.00 ఖర్చుతో బడ్జెట్ అంచనాలు రూపొందించినట్లు చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ తెలిపారు. గత బడ్జెట్ లో ఆదాయం రూ. 14.00 కోట్లు ఉండగా రాబోయే సంవత్సరంలో ఆదాయం రూ. 15.32 కోట్లు రావచ్చని తెలిపారు. ఈ సమావేశంలో మునిసిపల్ కమీషనర్ డి.వి.ఎస్ నారాయణరావు, వైస్ చైర్మన్లు పులి శాంతి, మాణిక్యరావు, మేనేజర్ ప్రసాద్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.