Friday, November 29, 2024

Creating liberating content

తాజా వార్తలుమైదుగోళంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం .

మైదుగోళంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రచారం .

హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమానుల్లా.

లేపాక్షి : మండల పరిధిలోని మైదు గోళం గ్రామంలో హిందూపురం అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమానుల్లా నేతృత్వంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. లేపాక్షి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగాధరప్ప, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి ఆదమ్ ఆధ్వర్యంలో మైదుగోళం గ్రామంలో ఇంటింటా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మైదుగోళంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి అనంతరం మసీదు సమీపంలో మైనార్టీ సోదరులను కలిసి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అమానుల్లా వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆమానుల్లో మాట్లాడుతూ త్వరలో జరగనున్న ఎన్నికల్లో హిందూ ముస్లిం సోదరులు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. గతంలో మైదుగోళం గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచేవారన్నారు. కాంగ్రెస్కు మైదుగోళం గ్రామం కంచుకోటగా నిలిచిందన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మైదుగోళం గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతునికి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని కోరారు. అనాదిగా ముస్లిం మైనారిటీ సోదరులు కాంగ్రెస్ పార్టీ వింటే నిలిచారని, పార్టీకి విశేష సేవలందించారన్నారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో కూడా మైనార్టీలు కాంగ్రెస్ వెంటే ఉంటారని ఆమానుల్ల ధీమా వ్యక్తం చేశారు. 2024లో జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే అందరికీ సమన్యాయం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ రాజ్యాన్ని మరోసారి స్థాపిస్తామని పేర్కొన్నారు. ప్రచార సందర్భంగా ఇంటింటా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటా పంచిపెట్టారు. వీటితోపాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు ఆర్థిక సహకారం, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు, చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులకు నిరుద్యోగ భృతి, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు, ఇంటి స్థలం ఉన్నట్లయితే 5 లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీ, ప్రత్యేక హోదా అమలు, రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ, నూతనంగా దరఖాస్తు చేసుకున్న రైతులకు ఐదు లక్షల రూపాయల పంట రుణాలు తదితర సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాలని హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమానుల్లా ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ నాయకులు సంజీవప్ప, అసెంబ్లీ రైతు సంఘం అధ్యక్షులు బాబు, కార్మిక సంఘం నాయకులు అజ్మతుల్లా, సయ్యద్, నరసింహప్ప, ఆనందరెడ్డి లతోపాటు పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article