Thursday, November 28, 2024

Creating liberating content

టాప్ న్యూస్యువగలం ఇక ఉరకలేస్తుందా

యువగలం ఇక ఉరకలేస్తుందా

లోకేష్ టీడీపీలో కొత్త జోష్ నింపుతాడా
బాబు స్థానాన్ని భర్తీ చేస్తాడా
(ఏ.రామమోహన్ రెడ్డి,సీనియర్ పాత్రికేయులు)
60రోజుల విరామం, అరెస్ట్ చెస్తారనే ఊహాగానాలు, అంతకు మించి అనుకోని రీతిలో తండ్రి అరెస్ట్ ఇలా అగమ్యగోచరంగా సాగిన తరువాత అనారోగ్య కారనాలతో పార్టీ అధినేత కు ఊపసమం కలగడం ఈ లోగా పార్టీలో కొంత నిస్తేజం ఏర్పడం ఇలా అనేక సంక్షోభాలు ఏర్పడ్డాయి తెలుగుదేశం పార్టీలో .వాటినన్నిటిని ఎదుర్కొని ఇక ప్రజాక్షేత్రం లోకి రానున్నారు యువనేత నారులోకేశ్.
సుదీర్ఘ రాజకీయ అనుభవం దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు అరెస్ట్ ఒక్కసారిగా టీడీపీ ని కలవర పాటు గురిచేసింది అరెస్ట్ చేయలేరు..చేస్తే వెంటనే బెయిల్ వస్తుంది..లేదా కేసు కొట్టివేస్తారు..ఇది అనాదిగా టీడీపీ పార్టీ, క్యాడర్ లో గ్రామీణ స్థాయి వరకు ఉన్న నమ్మకం.కానీ అందరి అంచనాలను తారుమారు చేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.ఏ వ్యవస్థలను తనకు అనుకూలంగా మార్చకుని చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారన్న అనుమానం మొదటి నుంచి ఉందొ అదే వ్యవస్థలో కి దూరి ఎవ్వరు ఊహించని సాహసించని పనిని నీవు నేర్పిన విద్యేగా నీరజాక్ష అన్న చందంగా జగన్ వ్యూహారచ8 చేయడం చంద్రబాబు చిక్కడం ఇవన్నీ చక చకా జరిగిపోయాయి.దీనితో పాటు ఒక్కసారిగా టీడీపీ పార్టీలో ఉన్న బలమైన క్యాడర్ కు ముచ్చెమటలు పట్టించేలా యువనేత లోకేష్, హెరిటేజ్ సంస్థకు ఇలా ఒకటి కాదు కేసులు సంఖ్య పెరిగి పోయి కోర్టుల్లో వాదనలు నడుస్తూ ఉన్నాయి.న్యాయపోరాటం పేరుతో నారాలోకేశ్ ఢిల్లీలో మకాం వేసిన ఏపీ సిఐడి అక్కడ కు వెళ్లి నోటీసులు ఇవ్వడంతో ఇక లోకేష్ కూడ జైలు కు వెళ్తారు అన్న రూమర్స్ బాగా వినిపించాయి.ఆ తరువాత పెద్దమ్మ సాయంతో గెలిచిన కొన్ని నెలలు తరువాత సొంత ప్రాంతానికి రావాలంటే సాహసించని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ,కేంద్రమంత్రి కిసన్ రెడ్డితో కలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటి కావడం ,ఆ తరువాత లోకేష్ వ్యవహారం లో జగన్ ప్రభుత్వం యూటర్న్ తీసుకోవడం ఈ లోగా చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతుండటం చివరికి మధ్యంతర,ఆపై పూర్తి బెయిల్ రావడంతో ఊపిరి పీల్చు కుని ఆగిపోయిన పాదయాత్ర ను అనుకున్న షెడ్యూల్ ను కుదింపు చేసుకుని తిరిగి నేటినుండి ప్రారంబమవుతున్నది.అనుకున్న లక్ష్యం ఒకటి ఇప్పుడు కొనసాగుతున్న ది ఇంకొకటిగా ఉంది. మరి అరెస్ట్ చేస్తారనే అనుమానమా లేక భయమా తెలియదు గానీ మొత్తం మీద యువగలం కుదింపు చేసినట్లు పార్టీ వర్గాలే అధికారి కంగా ప్రకటించాయి.అయితే ఇక్కడ ప్రధానంగా అనేక రకాల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువగలము లో యువనేత ఏ సమస్య పై మాట్లాడతార అన్న మీమాంస ఇప్పుడు వినిపిస్తోంది .మద్యం అంటే మద్యం కుంభకోణం జరిగిందని కేసు కోర్టులో ఉంది,ఇసుక ,అమరావతి, అభివృద్ధి, రోడ్లు ఇలా పలు రకాలుగా కేసులు బనాయించి చంద్రబాబు, లోకేష్, ఇతర టీడీపీ ముఖ్యనేతల అరెస్ట్ కు సిద్ధమై కోర్టు అనుమతి కోసం వేచి చూస్తోంది వైసీపీ సర్కార్.
ఇవన్నీ కాకుండా భవిష్యత్ లో ఇవి చేద్దామంటూ చెప్పుకొస్తే గత పాలనపై ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం బస్ యాత్రలు, బహిరంగ సభలలో రాష్ట్రాన్ని చుట్టుముట్టి ప్రజాక్షేత్రము లో విపక్షాలకు అవకాశం ఇవ్వకుండా దుమ్మెత్తి పోస్తుంది.
ఇన్ని సవాళ్ళను ఎదుర్కొని భవిష్యత్ లో ముఖ్యమంత్రి జగన్ ఏ టైం లో ఏ కేసులు పెట్టిస్తా రో తెలియక యువగలం ముందుకు సాగి ప్రజల్లో కొత్త ఉత్సాహం నింపుతుందా అన్నదే ఇప్పుడు అందరి నోట వినిపిస్తున్న మాట.వేచిచూడాలి మరి ఏం జరగబోతుందనేది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article