బిజినెస్ పార్ట్ టైంగా చేయొచ్చు కానీ.. రాజకీయాలు పార్ట్ టైంగా చేయలేమని గల్లా గుంటూరు ఎంపీ, టీడీపీ నేత గల్లా జయదేవ్ తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మా తాత రాజగోపాల్ నాయుడు వారసత్వంగా ప్రజా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రజాస్వామ్యం లో కొన్ని వ్యవస్థలు, ఫుల్ టైం కొన్ని వ్యవస్థలు పార్ట్ టైం పని చేస్తాయని చెప్పారు. తనను రెండుసార్లు గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గెలిపించినందుకు ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. చివరి మూడు సంవత్సరాలుగా నేను క్షేత్ర స్థాయిలో అందుబాటులో లేను…కానీ పార్లమెంట్ లో గుంటూరు ప్రజలకు ఏం చేయాలో అవి చేస్తూనే ఉన్నానని వెల్లడించారు. తనకు రాజకీయంగా అవకాశం ఇచ్చిన చంద్రబాబుకు రుణపడి ఉంటానన్నారు. ఎంపీ గా రెండు సార్లు గెలిపించిన గుంటూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.