రైతాంగానికి సబ్సిడీపై విత్తనాలు ఎరువులు ముందుగానే సిద్దం చేయాలి
- మందస్తుగానే వరద సహాయక చర్యలు చేపట్టాలి.
వి.ఆర్.పురం
వచ్చే నెల మొదటి వారం నుంచే తీవ్ర వర్షాలు సంభవించే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో, రానున్న వరదలకు పునరావాస కేంద్రాల్లో అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించాలని, సిపిఎం పార్టీ రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలంలోని చినమట్టపల్లి గ్రామం వద్ద పంకు సత్తిబాబు అధ్యక్షన మండల కమిటీ సమావేశం జరిగింది. ఈసమావేశంలో బొప్పేన కిరణ్ మాట్లాడుతూ వచ్చే వ్యవసాయ సీజన్ ను దృష్టిలో ఉంచుకొని ముందుగానే రైతాంగానికి కావాల్సిన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు సిద్దం చేయాలని, రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగ కుండా చూడాలనీ వ్యవసాయ అధికారులను డిమాండ్ చేశారు. ముందస్తు వరదలకు పునరవాసనికి వచ్చే నిర్వాసితులకు త్రాగునీటి సమస్యలు రాకుండా, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని, ముంపుకు గురవుతున్న గ్రామాలను ఎత్తైన ప్రాంతాల్లో షట్టర్ ఏర్పాటు చేసి, సోలార్ లైట్లు వేయించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా, నిత్యవసర సరుకులు, బరకాలు, బియ్యం ముందుగానే అందించాలని అన్నారు. వరదలు వస్తే మండలానికి రాకపోకలు నిలిచిపోతాయని, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని, గతంలో ఇలాగే జరిగిందని ఇప్పుడు ఇలా జరగకుండా చర్యలు ముందుగానే చేపట్టాలని అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు, తుమ్ములేరు కోటారుగొమ్ము, జీడిగుప్ప, శ్రీరామగిరి, కల్తునూరు, రామవరం, వెంకన్న గూడెం, గ్రామాలు గుట్టల పైన గుడారాలు వేసుకొని ఉంటారని, వారికి మండలానికి సంబంధాలు తెగిపోయి ఉంటాయి కనుక ఎప్పటి కప్పుడు వైద్య బృందాన్ని పంపించాలని, గతంలో పాము కాటికి వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారని, ఈసారి గుడారాల వద్ద సోలార్ లైట్లు వేయించాలని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలిగిన ఉపేక్షించేది లేదని వారు అన్నారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లోత రామారావు, జిల్లా కమిటీ సభ్యులు పూనెం. సత్యనారాయణ, మేకల నాగేశ్వరరావు, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, కూనవరం మండల కార్యదర్శి పాయం. సీతారామయ్య.. మండల నాయకులు పండా వెంకటేశ్వర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు