గండేపల్లి.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి తో గెలుపు తథ్యమని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ అన్నారు. గురువారం గండేపల్లి మండలం జెడ్. రాగంపేట వైసీపీ మండల అధ్యక్షులు, గ్రామ సర్పంచ్ కందుల చిట్టిబాబు వారి కుటుంబ సభ్యులతో, ఆయన అనుచర గలంతో భారీగా జ్యోతుల నెహ్రూ సమక్షం లో జెడ్. రాగంపేట గ్రామం లో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ లో చేరారు. జెడ్. రాగంపేట నుంచి భారీ బైక్, కార్ల తో ర్యాలీ గా బయల్దేరి జాతీయ రహదారి మురారి గ్రామం చేరుకుని అక్కడ దివంగత కందుల కొండయ్య దొర విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుంచి మురారి గ్రామానికి చెందిన టీడీపీ శ్రేణులతో ర్యాలీ గా జగ్గంపేట గోకవరం రోడ్ లో ఉన్న సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ కు చేరుకుని భోజనాలు చేసిన అనంతరం సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కందుల చిట్టిబాబు మాట్లాడుతూ నాకు వైసీపీ అభిమానం ఏమి కాదు, వ్యాపార లావాదేవీల వల్ల పార్టీ మారాను అని ఆయన తెలిపారు. 1994 లో నెహ్రూ తొలిసారి ఎమ్మెల్యే గా గెలిచి 1994 లోనే సర్పంచ్ గా పోటీ చేసాము అని తెలిపారు. ఏ ఎన్నికలు నిర్వహించిన టీడీపీ లోనే ఉంటాను అని ఆయన తెలిపారు. కొండయ్య దొర అశాయల మేరకు పార్టీ, నెహ్రూ అదేశను శారం పార్టీ విజయానికి కృషి చేస్తానని తెలిపారు. అదే విధంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ టీడీపీ లో ఒక నూతన అధ్యాయం ప్రారంభం అయిందన్నారు. టిడిపి లోకి పునః ప్రవేశం చేసిన కందుల చిట్టిబాబు, విజయ్, వినయ్ వారితో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు టిడిపి లో చేరడం చాలా ఆనందం గా ఉందన్నారు. పాత, కొత్త కలయిక లను కలుపుకుని పోవలన్నరు. 5 సంవత్సరాలు కూడా అహర్నిశలు శ్రమించను అన్నారు. 2014 తరువాత ఎమ్మెల్యే గెలిచి టీడీపీ లోకి అవిశ్రాంతంగా పోరాడన్నారు. దురదృష్టవశాత్తు 23 వేల ఓట్ల మెజార్టీ తో ఓడడం జరిగిందన్నారు. తాము లేక మేము నష్టపోయము అని ప్రజలు చెబుతున్నారు అని ఆయన అన్నారు. తాళ్లూరి ఎత్తిపోతల పథకం తెచ్చుకుని పంటలను సస్య స్యమలం గా పండించుకున్నామని ఆయన తెలిపారు. ప్రస్తుత వైసీపీ ఇంఛార్జి టికెట్ కోసం పోరాడుతున్న కృషి నియోజకవర్గ అభివృద్ధి లో ఉంటే బాగున్ను అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో కొర్పు లచయ్య దొర,పోతుల మోహనరావు, మారిశెట్టి భద్రం, ఎస్ వి ఎస్ అప్పలరాజు, కోర్పు సాయి తేజ, పాలకుర్తి ఆదినారాయణ, యర్రంశెట్టి బాబ్జీ, కంటిపూడి రామయ్య, అడబాల భాస్కరరావు, సుంకవాల్లి రాజు, కొత్త కొండబాబు, జగ్గంపేట క్లస్టర్ ఇంఛార్జి మణీబాబు, చినబాబు, రాష్ట్ర యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.