రామ్ చరణ్ తేజ్ ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు డైరెక్షన్ ఆర్‌సీ16 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం ఉత్తరాంధ్ర నుంచి ఏకంగా 400 మందిని తీసుకోనున్నారట. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీతో బిజీగా ఉన్నాడు. తండ్రి కొడుకులుగా నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్‌కు హీరోయిన్లుగా బాలీవుడ్ బ్యూటి కియారా అద్వాణీ, అంజలి నటిస్తున్న సంగతి తెలిసిందే. వినయ విధేయ రామ సినిమా తర్వాత గ్లామర్ బ్యూటి కియారా అద్వానీ రామ్ చరణ్ మరోసారి నటిస్తున్న సినిమా ఇది. అయితే ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా రామ్ చరణ్ మరో క్రేజీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే.
రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ మాత్రమే కాకుండా చేస్తున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ఆర్‌సీ16. రామ్ చరణ్ సినీ కెరీర్‌లో 16వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాకు ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికీ ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో సినిమా అనగానే మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాకుండా ఇందులో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రాషా తడానీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనుందని రూమర్స్ కూడా వచ్చాయి.
దాంతో రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాపై మరింత క్యూరియాసిటీ నెలకొంది. ఇదిలా ఉంటే RC16 మూవీ నటీనటుల కోసం బుచ్చిబాబు సానా వెతుకున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఈ విషయం గురించి మరో కీలక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. RC16 కోసం ఏకంగా 400 మందిని తీసుకోనున్నట్లు తాజాగా అధికారికంగా ప్రకటించారు.
రామ్ చరణ్ బుచ్చిబాబు RC16 సినిమా కోసం కేవలం ఉత్తరాంధ్ర నుంచే ఏకంగా 400 మందిని ఎంపిక చేసుకోనున్నట్లు లేటెస్ట్ పోస్ట్ ద్వారా చెప్పారు. విభిన్న క్రాఫ్ట్స్ చూసుకునే సాంకేతిక నిపుణులు, ఉత్తరాంధ్ర స్లాంగ్‌లో అనర్గళంగా డైలాగ్స్ చెప్పే ప్రతిభ ఉన్న నటీనటులు కావాలని మేకర్స్ ప్రకటించారు. ఔత్సాహిక నటీనటులందరిని ఆడిషన్ చేసేందుకు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల పేర్లను కూడా రివీల్ చేశారు మేకర్స్.
RC16 సినిమా కోసం చేసే ఆడిషన్‌ను ఫిబ్రవరి 5 నుంచి ఫిబ్రవరి 17 వరకు నిర్వహించనున్నారు. అందుకు విజయనగరం, సాలూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం వేదికలు కానున్నాయి. ఆ నాలుగు ప్రాంతాల్లో RC16 మూవీలో నటించేందుకు సుమారు 400 మందిని ఆడిషన్ చేయనున్నాను సినిమా దర్శకనిర్మాతలు. మరి తమ టాలెంట్ నిరూపించుకునే కొత్తవాళ్లకు ఇదో సువర్ణవకాశం. ఇదిలా ఉంటే ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.ఈ విషయానికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన ఇచ్చారు.