Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలురాష్ట్రానికి మళ్లీ సీఎం జగన్ రావాలి..!

రాష్ట్రానికి మళ్లీ సీఎం జగన్ రావాలి..!

‘ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకుకావాలి’కార్యక్రమంలో వెల్లువెత్తిన ప్రజాభిప్రాయం..
ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని భావిస్తేనే.. ఓటు వేయండి..
కుల మతాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలు..
తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి..

చంద్రగిరి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్లీ సీఎం జగన్ రావాలి..
చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావాలి అంటూ చంద్రగిరి ప్రజలు ముక్తకంఠంతో నినదించారు. మండలంలో పనబాకం, కల్ రోడ్డు పల్లి, యం.కొంగరవారి పల్లి, ఐతేపల్లి & అగరాల పంచాయతీలలో శుక్రవారం ‘ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు కావాలి ‘ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన తుడా ఛైర్మెన్, చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి మహిళలు, పార్టీ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికారు. అగరాల పంచాయతీలో గుమ్మడికాయలు, టెంకాయలు, నిమ్మకాయలతో దిష్టి తీశారు. గజ మాలలతో సత్కరించారు. అనంతరం సభా ప్రాంగణం వరకు ర్యాలీగా తరలివచ్చారు. అన్ని పంచాయతీలలో పార్టీ జెండా ఆవిష్కరణలు చేసిన మోహిత్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహాన్ని నింపారు. జై జగన్, జై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటూ నినాదాలతో హోరెత్తించారు. మా నమ్మకం నువ్వే జగనన్న శీర్షికన రూపొందించిన సంక్షేమ, అభివృద్ధి పథకాల బోర్డ్ లను ఆయన ఆవిష్కరించారు..
పల్లెలకు సచివాలయ వ్యవస్థ..
సీఎం జగన్మోహన్ రెడ్డి గ్రామీణ ప్రాంతాలకు సచివాలయ వ్యవస్థను చేరువ చేసి పరిపాలనను మరింత సులభతరం చేశారని తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొనియాడారు. ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని భావిస్తేనే.. ఓటు వేయండని ధైర్యంగా అభ్యర్థించే హక్కు ఒక్క వైఎస్ఆర్సీపీకి మాత్రమే ఉందన్నారు. కుల మతాలకు అతీతంగా అర్జతే ప్రామాణికంగా అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందజేసినట్లు వెల్లడించారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం నాడు-నేడు కింద పాఠశాలలు అభివృద్ధితో పాటు అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా దీవెన, విద్యాకానుక అందజేస్తూ కార్పొరేట్ విద్యను అందిస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోనే వృద్ధులకు రూ. 3 వేల పెన్షన్ అందజేస్తున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనిలుస్తుందన్నారు. రైతన్నలకోసంవ్యవసాయాన్నిమరింతగాప్రోత్సహించేందుకు రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుతో భరోసా కల్పించారన్నారు. ఎన్నికల ముందు సీఎం జగనన్న ఇచ్చిన హామీలలో 99 శాతం అమలు చేశారన్నారు. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమం కొనసాగాలంటే తిరిగి సీఎం జగనన్నను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేస్తున్నట్లు వివరించారు.
ఎమ్మెల్యే చెవిరెడ్డి చొరవ..
మీ పంచాయతీలో ఇంత అభివృద్ధి జరిగిందంటే.. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవతోనే సాధ్యమైందన్నారు తుడా ఛైర్మెన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. ఒక్క ప్రభుత్వ పథకాల అమలుకు పరిమితం కాలేదన్నారు. నన్ను నమ్మి ఓటు వేసి గెలిపించిన నా ప్రజలను.. నా కుటుంబ సభ్యులుగా భావించి నా సంపాదనలో 70 శాతం నియోజకవర్గ ప్రజలకు ఖర్చు చేస్తానని ఎమ్మెల్యే ప్రకటించిన సందర్భాన్ని ప్రస్తావించారు. ఆ మేరకు ప్రజలకు పండుగల సమయాల్లో కానుకలు అందజేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో దేశంలోనే ఏ ఎమ్మెల్యే చేయలేనంతగా సాహసం చేసి, ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజలకు సేవ చేశారన్నారు. సొంత నిధులు ఖర్చు చేసి ప్రజలకు పండ్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్క్ లు, సానిటైజర్లు, ఆనందయ్య మందులు, విపత్తుల సందర్బాలలో కూడా ప్రజలకు అండగా నిలిచామని తెలియజేశారు. నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేసేందుకు నిత్యం పరితపించే నాయకుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ప్రశంసించారు. నేటి యువతకు ఎమ్మెల్యే స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఆయన తనయుడిగా 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను.. ఆయన సేవాతత్వాన్ని రెట్టింపుగా కొనసాగిస్తానని మాట ఇస్తున్నాను.. మీ బిడ్డగా, మీ అన్నదమ్ముడిగా అభిమానించి..  ఓటు వేసి ఆదరించి ఆశీర్వదించాలని మోహిత్ రెడ్డి విన్నవించారు. కరోనా సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదని దుయ్యబట్టారు. తండ్రికి తగ్గ తయుడిగా తుడా ఛైర్మెన్ హోదాలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పల్లెల అభివృద్ధిలో భాగస్వాములయ్యారని పంచాయతీ ప్రతినిధులు కొనియాడారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా మోహిత్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందామని, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రుణం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. మోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందును ప్రజలు ఆస్వాదించారు.
*పనబాకం పంచాయతీలో రూ.9 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.. కల్ రోడ్డు పల్లి పంచాయతీలో రూ. 6 కోట్లతో, యం. కొంగరవారి పల్లిలో రూ.9.85 కోట్లు, ఐతేపల్లి & అగరాలలో రూ.6 కోట్ల నిధులతో అభివృద్ధి చేశామన్నారు.
*సంక్షేమ పథకాల ద్వారా పనబాకం ప్రజలకు రూ.28.06 కోట్లు అందజేశామన్నారు.. కల్ రోడ్డు పల్లిలో రూ.17.38 కోట్లు, యం. కొంగర వారి పల్లిలో రూ.18.41 కోట్లు అందజేసినట్లు తెలిపారు.
మోహిత్ రెడ్డి వెంట ఎంపీపీ హేమేంద్ర కుమార్ రెడ్డి, జడ్పిటిసి యుగంధర్ రెడ్డి, సింగిల్ విండో ఛైర్మెన్ మల్లం చంద్రమౌళి రెడ్డి, దక్షిణ డివిజన్ పార్టీ అధ్యక్షులు దేవారెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు తదితరులు ఉన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article