బుట్టాయిగూడెం
సాగులో ఉండి తమ భూములకు పట్టాలు లేని పేద రైతులకు భూమి హక్కు పట్టాలను పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు అందించారు. మండలంలోని దుద్దుకూరులో ఎమ్మెల్యే బాలరాజు క్యాంపు కార్యాలయంలో గురువారం ఈ పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కొయ్యలగూడెం మండలం, సరిపల్లికి చెందిన సాగులో ఉండి తమ భూములకు హక్కు పట్టాలు లేని పేద రైతులకు హక్కు పట్టాలను అందించారు. సుమారు ఆరు కుటుంబాలకు చెందిన పేద రైతులకు ఎమ్మెల్యే బాలరాజు, పోలవరం నియోజకవర్గం వైసీపీ కన్వీనర్ తెల్లం రాజ్యలక్ష్మి సాగు భూమి పట్టాలు పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్.జగన్ మోహన్ రెడ్డి చేసిన 3648 కిలోమీటర్లు సుధీర్ఘ పాదయాత్ర లో రైతులు పడిన ఇబ్బందులు గమనించి, సాగులో ఉండి ఆధారం లేనివారికి నేడు రాష్ట్ర వ్యాప్తంగా 58,260 ఎకరాలకు పట్టాలు పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. పేద రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సరిపల్లి వైస్సార్సీపీ నాయకులు, లబ్ది దారులు, తదితరులు పాల్గొన్నారు