Thursday, November 28, 2024

Creating liberating content

తాజా వార్తలులాస్ట్ పంచ్ మనదైతేఆ కిక్కే వేరబ్బా..!

లాస్ట్ పంచ్ మనదైతేఆ కిక్కే వేరబ్బా..!

ప్యాకేజీ స్టారన్నారు..

నిలకడ లేనోడని నిందలెత్తారు..

ముగ్గురు పెళ్లాలంటూ
వ్యక్తిగత జీవితంపై
కూడా బురద జల్లే
ప్రయత్నం చేశారు..

వేషాలేసుకునేటోడు
రాజకీయం ఏం చేస్తాడు..
ప్రజా సమస్యలు
ఎలా తెలుస్తాయని ఎకసెక్కాలాడారు..

అంతటి మెగాస్టారే
చాప చుట్టేసాడు..
ఇంక ఇతగాడెంతని
చిన్న చూపు చూసారు..

తానే గెలవలేనోడు
ఇంక ముందుండి పార్టీని
ఏం నడిపిస్తాడని
నవ్వుకున్నారు..

ఇన్నీ విన్నాడు…
అన్నీ భరించాడు..
రాయిలా..రాయల్ గా
నిలబడ్డాడు..

అలా ఆగిపోలేదు..
2024 ఎన్నికల్లో
అన్నీ తానే అయి కథ నడిపించాడు..

ఈ ఎన్నికల్లో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి తానే కా”రణమై”..
ఇంకెప్పుడూ కలవరనుకున్న
నరేంద్ర మోడీని..
చంద్రబాబుని కలిపి
అధికార పార్టీకి కలవరం..
కంపరం పుట్టించాడు..!

అసలు వైసిపి వ్యతిరేక
పవనం మొదలు కావడమే
పవన్ కళ్యాణ్ తో..

ఉద్దానంలో ఆగని పోరాటంతో
పవన్ కళ్యాణ్
ఈ రాష్ట్రంలో
ప్రభుత్వ వ్యతిరేక
వాతావరణానికి
మొదటగా తెర ఎత్తాడు..

ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం
ఎలుగెత్తుతూ జగన్ గుండెలో తొలిసారిగా
భయం పుట్టించి
అసలు చంద్రబాబు కంటే పెద్ద ప్రమాదం పవనే అన్న
భావనకు ఊపిరి పోశాడు..

అంతే..అక్కడి నుంచి జగన్ తప్పుల మీద తప్పులు చేస్తూ ఎన్నికల నాటికి
సెల్ఫ్ గోల్ వేసుకున్నంత
పని చేశారు..!

విశాఖ విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ ను అడ్డుకోవడంతో మొదలైన
జగన్ వ్యతిరేక పవనాలు
అలా నానాటికీ ఉధృతమై
ఇదిగో..పోలింగ్ నాటికి
టైట్ ఫైట్ అనే స్థాయి వచ్చింది..

ఆ తర్వాత..
చంద్రబాబు అరెస్ట్..జగన్ ఏమి ఆలోచించారో గాని
అది ఖచ్చితంగా బెడిసికొట్టింది.
చంద్రబాబుని రెండు మెట్లు ఎక్కించింది..
అదే సమయంలో
లోకేష్ ఇమేజ్ ను పెంచింది..ముద్దపప్పు అని ఎగతాళి చేసిన లోకేష్
ఆ సమయంలో
గట్టిగా నిలబడి చంద్రబాబు అరెస్టు ఉదంతాన్ని
జాతీయ స్థాయి నాయకుల దృష్టికి తీసుకువెళ్ళడంలో కృతకృత్యులయ్యాడు.
అంతే కాదు..
అప్పుడే ఎన్టీఆర్ కూతురు..
బాబు సతీమణి..
లోకేష్ తల్లి అయిన భువనేశ్వరి తొలిసారిగా ప్రజల్లోకి వచ్చి
తన కుటుంబం పట్ల..
పార్టీ పట్ల
సానుభూతి పెరగడంలో
ముఖ్యభూమిక పోషించారు..
ఇక్కడ కూడా పవనే..
మొత్తంగా బాబు వర్గం వెనక ఉండి విషయాన్ని
మోడీ వరకు తీసుకువెళ్ళి
రాష్ట్రంలో పరిస్థితి ఇదీ అని
పెద్దాయనకు వివరించి
ఆయన దృష్టిని చంద్రబాబు వైపు మళ్ళించడంలో సఫలీకృతులయ్యారు..
ఇదే ఈ ఎన్నికల్లో
అత్యంత కీలకం..

అటుపై కూటమి ఆవిర్భావంలో..
సీట్ల సర్దుబాటు..
ప్రచారం..
మోడీ..అమిత్ రాక..
వీటన్నిటిలో పవనే
సెంటర్ పాయింట్..!

అన్నిటి కంటే ముందుగా..
2024 ఎన్నికల్లో
వైసిపి వ్యతిరేక ఓట్లు
చీలిపోకూడదు
అనే కీలకమైన నినాదాన్ని ఎత్తుకుని దానికే
కట్టుబడి ఉండి
ఎన్నో రాజీలకు
తలొగ్గి ఈ ఎన్నికలను
మహాసంగ్రామంగా
మార్చిన నిన్నటి అజ్ఞాతవాసి..
నేటి కూటమి హస్తవాసి..!
రేపటి స్థిర నివాసి..!!

మొత్తానికి
ఈ మెగా “తమ్ముడు”
గత ఎన్నికల్లో
చేదు అనుభవం ఎదురైనా..
వర్తమానంలో
తాను “ఖుషీ” అయి..
ప్రత్యర్థి పాలిట
“గబ్బర్ సింగ్”గా అవతరించి..
రాజకీయంగా
ఈ “బాలు ABCDEFG” కూడా తెలియని వాడు అనే స్థాయి నుంచి..
2024 ఎన్నికల నాటికి కూటమి
అనే “తీన్ మార్” ను సృష్టించి…అధికార పార్టీపై “పంజా” విసిరి
“కొమరం పులి” అనిపించుకుని
మళ్లీ “అత్తారింటికి దారేది”
అని అడుగుతుంటే దారిదే
అని చూపించిన
“బంగారం”..!

వదిన నీడలో “జల్సా”గా
పెరిగినా..
“అన్న వరం”తో
హీరోగా అరంగేట్రం చేసిన
“బ్రో”.. ఇప్పుడూ.. అప్పుడూ..ఎప్పుడూ..
అభిమానుల
కొంగు “బంగారం”..!

సినిమా హీరో రాజకీయంగా జీరో అనుకుంటే..
మోడీకి..బాబుకి యారోగా
మారి..ప్రత్యర్ధి
నీరు గారి నీరోగా
అవతరించిన పరిస్థితి
కల్పించిన పవన్ కళ్యాణ్
2024 ఎన్నికల్లో
నిస్సందేహంగా
భీమ్లా నాయక్..!

సురేష్..9948546286

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article