—ఆర్ ఎస్ యు రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్ రెడ్డి
ప్రజా భూమి కడప అర్బన్
రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ (ఆర్ ఎస్ యు) ఆధ్వర్యంలో శనివారం నాడు కడప నగరంలోని RSU కార్యాలయంలో భగత్ సింగ్ 93 వర్ధంతి సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు….ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలకై భగత్ సింగ్ స్ఫూర్తితో విద్యార్థులు యువకులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. దేశంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అరాచకాలను రూపుమాపేందుకు కృషి చేయాలన్నారు. భగత్ సింగ్ 23 ఏళ్ల వయసులోనే స్వాతంత్ర కోసం అనేక పోరాటాలు చేసినటువంటి ఘనత భగత్ సింగ్ దక్కిందన్నారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఢిల్లీ నడి వీధుల్లో ఎర్ర కాగితాలు పంచుతూ ప్రజల్లో స్వాతంత్రం పై చైతన్యం నింపాడు. దేశ ప్రజల విముక్తి కొరకై బ్రిటిష్ తెల్ల దొరలు వారిని ఎదిరించి వాళ్లకు వ్యతిరేకంగా పార్లమెంటులో నినాదాలు చేస్తూ భారతదేశ విముక్తి కోసం పోరాడి వీర మరణం పొందారు.విద్యార్థులుగా యువకులుగా మనం కూడా నాణ్యమైన చదువు కోసం. ఉపాధి కోసం. నిరుద్యోగి యువతీ యువకులు చేయి చేయి కలిపి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసి మన హక్కుల కోసం పోరాడాలన్నారు. భగత్ సింగ్ ఆశయాలు కోసం రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ అలుపెరగని పోరాటాలు చేస్తుందని ఆయన స్ఫూర్తితో రాబోయే రోజుల్లో విద్యార్థులు పక్షాన పోరాడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ యు జిల్లా జిల్లా కార్యదర్శి చెన్నకేశవరెడ్డి. నగర అధ్యక్షులు హరి బాబు కార్యదర్శి సుమంత్ తదితరులు పాల్గొన్నారు