లేపాక్షి:-మండల పరిధిలోని చోళ సముద్రం వీవర్స్ కాలనీలో నూతన గృహ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై విజయ్ (19) అనే యువకుడు మృతి చెందినట్లు ఏఎస్ఐ సర్ఫుద్దీన్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చిలమత్తూరు మండల పరిధిలోని వడ్డీ చెన్నంపల్లి గ్రామానికి చెందిన పూజారి వెంకటాద్రి తన కుమారుడు విజయ్ తో పాటు మరో ముగ్గురు కూలీలతో చోళ సముద్రం వీవర్స్ కాలనీ లో నూతనంగా నిర్మిస్తున్న గృహ నిర్మాణ పనులకు గత నాలుగు రోజులుగా వస్తున్నారు. ఈ నేపథ్యంలో నీరు అవసరం కాగా విజయ్ మోటారును ఎత్తేందుకు వైరును వేసి ఆన్ చేయడం జరిగిందన్నారు. వెంటనే విద్యుత్ షాపు గురై విజయ్ క్రింద పడిపోయారని, వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించడం జరిగిందన్నారు. డాక్టర్లు అతన్ని పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారన్నారు. ఈ మేరకు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ సర్ఫుద్దీన్ తెలిపారు.