అనంతలో రాస్తారోకోకు వెళుతున్న నాయకుల అరెస్టు
ప్రజాభూమి బ్యూరో, అనంతపురం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఏఐటీయూసీ, సీఐటీయూ, ప్రజా సంఘాలతో రాస్తారోకోలో పాల్గొనేందుకు వెళ్తున్న అనంతపురం జిల్లా కాంగ్రెస్ నాయకులను నగరంలోని తపోవనం సర్కిల్లో పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆదేశాల మేరకు విశాఖ ఉక్కు ఉద్యమంలో భాగంగా చేపట్టిన రాస్తారోకోలు పాల్గొనేందుకు వెళుతున్న జిల్లా కాంగ్రెస్ పార్టీఅధ్యక్షులు బండ్లపల్లి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ అధ్యక్షులు దాదా గాంధీని అరెస్టు చేసి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అక్రమ అరెస్టును తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు నిరసన వ్యక్తం చేశారు. అరెస్టయిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కాపు గాజుల వాసు, రాష్ట్ర అధికార ప్రతినిధి శివ శంకర్ యాదవ్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రామ్ చరణ్ యాదవ్, గార్లదిన్నె మండల కన్వీనర్ ఓబిరెడ్డి, ఎన్ ఎస్ యూ ఐ నగర అధ్యక్షులు నిశాంత్ రెడ్డి, రాజీవ్ కాలనీ దుర్గ ప్రసాద్ రెడ్డి, శంకర్, రామాంజి, ఎన్ ఎస్ యూ ఐ చింటూ వివేక్, అఫ్జల్, చందు తదితరలు ఉన్నారు.