కూనవరం:
కూనవరం మండలం పెద్ద ఆర్కుర్ గ్రామపంచాయతీ సర్పంచ్ ఎం నాగమణి గ్రామ పంచాయతీలో వేసవి కాలంలో త్రాగు నీరు ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకున్నారు.ఆదివారం ఆర్కుర్ గ్రామంలో విలేజ్ వాక్ నిర్వహించి మద్య గుంపులో మంచినీటి కి సంబంధించిన పైప్ లైన్ పనులు జరుగుతుండగా పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ పరిపాలన నేను చేపట్టిన నాటి నుంచి రేపాక, బండారుగూడెం, భగవాన్ పురం గ్రామాలలో మంచినీటి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని యుద్ధ ప్రాతిపదిక బోర్లు వేయించి డైరెక్ట్ పంపింగ్ ద్వారా ప్రజలకు మంచినీటి సౌకర్యం కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. రేపాక ,భగవాన్ పురం గ్రామాలలో రెండు హ్యాండ్ బోర్లు ఏర్పాటు చేశామని,గండి కొత్తగూడెం రోడ్డు సమస్యతో పాటు ,అన్ని గ్రామాలలో అంతర్గత సిసి రోడ్లు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, ఐటిడిఎ పిఓ కి లిఖిత పూర్వకంగా కోరడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దర్ముల అమ్మాజీ,మాజీ ఎంపిటిసి పాయం సత్యనారాయణ, శ్రీరామ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.