అమరావతి:
ఉభయ తెలుగురాష్ట్రాల్లో డా.వైఎస్ రాజశేఖరరెడ్డి ది ఓ చెరగని ముద్ర.ఆయన రాజకీయ పటిమ, కుటుంబ నేపథ్యం ఏది చూసిన ఓ చరిత్రే.ఓటమి ఎరుగని నేతలు గా వైఎస్సార్ కుటుంబం విజయాలను సొంతం చేసుకుంది. తెలుగురాష్ట్రాల్లో ఎందరినో మరెందరినో ముక్కు మొహం తెలియని,రాజకీయ పరిజ్ఞానం లేని వారిని రాజకీయ ముఖచిత్రంలో నిలిచి పోయేలా చేసిన ఘనత వైఎస్సార్ దే.టీ కాఫీలు అందించె వారిని అసెంబ్లీ లో ప్రజాప్రతినిదులుగా ఎదిగే విదంగా వెనుక ఉండి ప్రోత్సహించారు.రాయలసీమ రక్త చరిత్రను కూడా కాలానుగుణంగా సమూలంగా అణిచివేసి శాంతి కపోతాలను ఎగురవేసి కడపబాంబులు,అయ్యో రాయలసీమ రౌడీయిజం అన్న అర్థాన్ని మర్చివేసి అందరిని మురిపించి మాతృభూమి ఒడిలో కుట్రలకు బలి అయ్యి భౌతికంగా దూరమై,మానసికంగా కోట్లాదిమంది హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు వైఎస్సార్.తదినంతర పరిణామాలలో యువనేత తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక అసువులు బాసిన వారికి ఆపన్న హస్తం ఇచ్చేందుకు ఆ కుటుంబాలకు మనో నిబ్బరం కలిగించడానికి వెళ్తే అక్రమ కేసులు అన్నారు అదన్నారు. .ఇదన్నారు .ఇక్కట్లు పాలు చేయడానికి 16 నెలలు జైలు జీవితం గడిపారు..తండ్రి ఆశయ సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసాడు…అనేక విమర్శలు అవమానాలు భరించాడు.ఎమ్మెల్యేలు పిరాయింపు చేసి పరువు తక్కువ మాటలు అన్నా పెదాలపై చిరునవ్వును చెదరినివ్వకుండా చక్కటి ప్రణాళికలు వేసుకుని ప్రజయాత్ర చేపట్టి ప్రజలు ఆశీస్సులు పొంది ప్రభుత్వాధి నేతగా నిలబడి తిట్టిన నోటితోనే పొగడబడి ,వేలు చూపించిన వాడే చెయ్యెత్తి జై కొట్టేలా ముందుకు సాగారుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.వ్యతిరేక మీడియా విషం చిమ్ముతున్న మే31 2019 నుంచి ఏప్రిల్ 18 వరకు నేనెక్కడినే ,మంచి చెస్తేనే ఆశీర్వదించమని కోరుతూ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రాణాలకే ముప్పు తెచ్చి మట్టు పెట్టాలని పన్నాగం పన్నారంటే ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందా అన్న ఆలోచన చేయాల్సి వస్తోంది.తనతో పాటు తనను విశ్వసించి వారికోసం దారులు చిన్న వైన తనకోసం ఎదురు చూస్తున్నారని ఆ దారిలో వెళితే ఆయన ప్రాణాలకె ముప్పు తెచ్చారు రాజరాజేశ్వరి పేట రౌడీ మూకలు. ఆ ప్రాంతంలో డిప్యూటీ మేయర్ ఉన్నారు…వారి వెంట ప్రజలు ఉన్నారు అయిన అక్కడి వారే ఇంతటి దూరాఘాతానికి పాల్పడ్డారంటే నేతలు తప్పిదాలు కూడా ఎంతో కొంత ఉన్నట్లే అన్న అనుమానాలకు తావిస్తున్నాయి.నిత్యం ప్రజాసంక్షేమ మే పరమావధిగా ఉన్న ప్రజనేతపై పనికిమాలిన వారు ఇంతటి తెగింపు చేశారంటే అది స్థానిక నేతలు, ఆ ప్రాంత ప్రజాప్రతినిధుల అలసత్వం, నిఘా అధికారుల వైఫల్యం, ముఖ్య మంత్రి భద్రత పట్ల ఏమరపాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.ఈ వరుస సంఘటనలు చూసి వైఎస్సార్ కుటుంబం ప్రజలకు మంచి చేయడమే పాపమా అన్న ఆవేదన చెందుతున్నారు.టీడీపీ అభ్యర్థి బోండా ఉమా అనుచరులు ఇంతటి ఓర్వలేని తనానికి పాల్పడ్డారన్న ఆక్రోశం వైసీపీ నేతలు, వైఎస్సార్ అభిమానులు వెళ్లబుచుతున్నారు. చూద్దాం ప్రజాబలం ప్రజనేతకు ఎలా ఉంటుందో.