జగనన్నను మళ్ళీ సీఎం చేసేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు
మార్కాపురం :మార్కాపురం టౌన్ లో 31వ వార్డులో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మార్కాపురం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి గా మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థి గా చెవిరెడ్డిని గెలిపించండి ఎమ్మెల్యే అన్నాను ఆప్యాయంగా పలుకరిస్తూ ఆహ్వానిస్తున్న ప్రజలు, వైసీపీ నాయకులు నియోజకవర్గ ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో రాష్టంలో ప్రతి కుటుంబం సంతోషంగా ఉందని.సంక్షేమ పాలన కొనసాగాలంటే మరోసారి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సిపి అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం మార్కాపురం పట్టణంలోని 31వ వార్డులోని మౌలాలి బజారు, తోళ్ల ఖాసీం బజారు, సుబ్బారెడ్డి వీధి, ఆంజనేయ స్వామి గుడి ఎదురు లైన్, విద్యా నగర్ వీధుల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో మార్కాపురం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా పాల్గొన్నారు. ఈ సందర్బంగా వార్డులోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం చేసిన మంచి పనులను వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని మార్కాపురం అభ్యర్థి అన్నా ప్రజలను అభ్యర్థించారు. మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి గా పోటీ చేస్తున్న మీ అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి వేయించి గెలిపించాలన్నారు. ముందుగా వార్డులోని పలువురు వైసీపీ నాయకులు, పలువురు వైసీపీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ఎమ్మెల్యే అన్నాను ఘనంగా సన్మానించి ఆహ్వానం పలికారు. అనంతరం హోలీ పండుగను పురస్కరించుకొని నియోజకవర్గ పరిధిలోని ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే అన్నా మాట్లాడుతూ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రి జగనన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జనరంజక పాలన అందించారన్నారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమాన్ని అందించారని తెలిపారు. మరోసారి వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరారు. అబద్దపు హామీలు ఇచ్చే టీడీపీ కూటమి చెప్పే మాటలను… ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం పనిచేస్తోన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి ప్రజలు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జగనన్న మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉంటారని జోష్యం చెప్పారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈకార్యక్రమంలోపలువురు వైసీపీ ముఖ్య నాయకులు,వైసీపీ ప్రజా ప్రతినిధులు, జడ్పీటీసీ సభ్యులు,ఎంపీపీలు,వైస్ఎంపీపీలు,ఎంపీటీసీ సభ్యులు,సర్పంచ్ లు,కో – ఆప్షన్ సభ్యులు,మార్కెట్ యార్డ్ చైర్మన్, ఏఎంసీ వైస్ చైర్మన్లుడైరెక్టర్ లు,మున్సిపాలిటీచైర్మన్,వైస్ చైర్మన్ లు,కౌన్సిలర్లు,కో-ఆప్షన్మెంబర్లు,పలు కార్పొరేషన్.డైరెక్టర్లు,సభ్యులు,రాష్ట్ర,జిల్లా కమిటీ సభ్యులు,మండల పార్టీ కన్వినర్ లు,కమిటీ సభ్యులు,పార్టీ అనుబంధ విభాగాల సభ్యులు,jcs ఇంచార్జి లు, సచివాలయ కన్వినర్ లు,సోషల్మీడియా.సభ్యులు,గృహ సారదులు,వైసీపీ కుటుంబ సభ్యులు,నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు