పులివెందుల టౌన్ :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కాపులకు సముచిత న్యాయం జరిగిందని రాయల్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగల వీరాంజనేయులు,గండి దేవస్థానం చైర్మన్ కావలి కృష్ణ తేజ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలమూరు పెద్ద వీరయ్య, దేవస్థానం బోర్డు మెంబర్ బత్తెన శేఖర్ లు అన్నారు. ఈ సందర్భంగా వారు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల రూపంలో గృహవసతి, కాపు నేస్తం, విద్యా దీవెన, వసతి దీవెన,ఆరోగ్యశ్రీ భావి తరాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందజేసి ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలిచారన్నారు అలాగే కాపు బలిజ తేలగా ఒంటరి కులాల కోసం కాపు నేస్తం పథకం ద్వారా 45 ఏళ్ల నిండిన మహిళలకు సంవత్సరానికి 15000 చొప్పున నాలుగేళ్లలో 60 వేలు అందజేయడం జరిగిందన్నారు. 2024 మేనిఫెస్టోలో 60 వేలను రెండింతలు చేసి 1, 20, 000 రూపాయలు అందజేయనున్నట్లు వారు తెలిపారు.
అలాగే రాబోయే ఎన్నికలలో కూడా కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా బలోపేతం చేసేందుకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను ఇవ్వడం జరిగిందన్నారు ఈ ఎన్డీఏ కూటమి కాపు బలిజ తెలగలకు సంక్షేమానికి మేనిఫెస్టోలో ఒక్క హామీ కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ రానున్న ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అంతా కూడా వైఎస్సార్ సీపీ గెలుపునకు కృషి చేసే విధంగా ప్రతి ఒక్కరు పని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డి లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కాపు సోదరులను కోరారు.