యనమల కృష్ణుడు పిలుపు
తుని
ఫ్యాక్షనిస్టు భావజాలాలు నిండుగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని దోపిడి దౌర్జన్యాలకు కేరాఫ్ గా మార్చేశారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు ఆరోపించారు.తుని మండలం టి.వెంకటాపురం గ్రామంలో మండల టిడిపి అధ్యక్షుడు అప్పన్న రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీలో కి చేరికలు జరిగాయి. యువనేత పప్పు నవీన్ ఆధ్వర్యంలో పప్పు అప్పారావు, పప్పు పాండురంగారావు, పప్పు లోవరాజు, పప్పు చినరమణ, పప్పు రాజు, సిద్ద దొరబాబు, గింజాల రాజు, గింజాల భద్రం, గొర్లి రాజు,, పల్లా శ్రీను, కొల్లి శ్రీను, నక్కిళ్ల వెంకట్రావు సహా 150 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు.వీరికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ కార్యదర్శి యనమల కృష్ణుడు, నియోజవర్గ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ కోఆర్డినేటర్ పోల్నాటి శేషగిరిరావు పసుపు కండువాలు కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనకు చరమగీతం గీతం పలకవలసిన సమయం ఆసన్నమైందని, అభివృద్ధి సంక్షేమానికి తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ఇనుగంటి సత్యనారాయణ, గాది వరహాల బాబు, వంగలపూడి బుజ్జి, వంగలపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.