Monday, April 21, 2025

Creating liberating content

Uncategorizedవైయస్సార్ ఆసరా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు భరోసా

వైయస్సార్ ఆసరా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు భరోసా

మహిళ సాధికారతే ద్యేయం ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా

పోరుమామిళ్ల:
పోరుమామిళ్లలో గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైయస్సార్ ఆసరా 4వ విడత కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ డిసి గోవింద రెడ్డి,బద్వేల్ శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, పాల్గొని పొదుపు మహిళల అక్క చెల్లెమ్మలకు చెక్కులు పంపిణీ చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా మాట్లాడుతూ నాడు చంద్రబాబుకి నేడు జగనన్న మధ్య తేడా గమనించాలని చెబుతూ, రానున్న ఎన్నికల్లో మహిళలు అందరు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలిచి మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు నాగార్జున రెడ్డి, బద్వేల్ మాజీ మార్కెట్ యాడ్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, జిల్లా పిడి, ఆప్కోస్ స్టేట్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, ఎంపీటీసీలు, వైస్ ఎంపీపీలు సి. భాష, చెన్ను రాజశేఖర్, జడ్పిటిసి ముత్యాల ప్రసాద్, చాపాటి లక్ష్మీనారాయణ రెడ్డి, సర్పంచులు, సచివాలయం కన్వీనర్లు, ప్రభుత్వ అధికారులు, వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పొద్దుపు సంఘాలు మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article