ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొగ్గిటి డేనియల్
పులివెందుల :వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థు లలో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఎక్కువ మందికి సీట్లు కేటాయించడం హర్షణీయదగ్గ విషయమని వైయస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బొగ్గిటి డేనియల్ బాబు పేర్కొన్నారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూసామాజిక న్యాయం లో భాగంగా దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఎక్కువ శాతం ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించడం చాలా సంతో షకరమైన విషయం అన్నారు.ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సీట్లు కాంగ్రెస్, తెలుగుదేశం, జనసేన ,బిజెపి ,ఏ పార్టీ కూడా ఇన్ని సీట్లు సామా జిక న్యాయం పాటించలేదని ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ విధంగా సామాజిక న్యాయం పాటించి ఎక్కువ సీట్లు ఇచ్చిందని ఆయన అన్నారు.దమ్ముంటేతెలుగుదేశం,జనసేన , బిజెపి పార్టీలు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బీసీ,లకు సీట్లు ఇచ్చే ధైర్యం ఉందా అని ఆయన ప్రశ్నించారు.దేశంలో ఏ పార్టీ కూడా ఇన్ని సీట్లు ఎస్సీ ,ఎస్టీ, బీసీ ,మైనార్టీలకు, ఇవ్వలేదని ఒక్క వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్ర మే ఈ విధంగా ఇచ్చిందని కావున ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నాయకులు ప్రజలు మొత్తం వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను గెలిపించి వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సి న బాధ్యత మనందరిపై ఉందన్నారు. రాష్ట్రంలోని ఓటర్లంతా ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ఆయన అభ్యర్థించారు.