చంద్రగిరి :
జగనన్న సంక్షేమ పాలన మళ్ళీరావాలి.. అప్పుడే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉంటారు… దీనికోసం చంద్రగిరి నుంచి బరిలో నిలుస్తున్న మోహిత్ రెడ్డి విజయాన్ని మొదటి గెలుపుగా జగనన్నకు కానుక ఇచ్చేందుకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హార్షిత్ రెడ్డి అభ్యర్థించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి ముందు చూపుతో చేసిన అభివృద్ధి పనులతో చంద్రగిరి నియోజకవర్గ రూపురేకలు మారాయని.. చంద్రగిరి చరిత్రలో జగనన్న పాలన చిరస్మరణీయంగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు. శనివారం చంద్రగిరి మండలం రంగంపేట గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. గడప గడపకు వెళ్లి సంక్షేమ పథకాల జాబితాలను అందజేశారు. తండ్రికి తగ్గ తనయునిగా జనం ముందుకు వచ్చిన తన అన్నయ్య మోహిత్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ కోరారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా.. అనునిత్యం చంద్రగిరి ప్రజల సంక్షేమం కోసం కృషి చేశారని, కరోనా వంటి కష్టం వచ్చినా.. వరదలు వంటి విపత్తు వచ్చినా.. ఎవ్వరికి ఏ ఆపద వచ్చినా.. నేనున్నాను అంటూ అండగా నిలిచారంటూ గుర్తు చేశారు. దీంతో పండుగలు వచ్చినా పర్వదినాలు వచ్చినా తన కుటుంబ సభ్యులకంటే ఎక్కవగా ప్రజలకు ఏదో ఒకరకంగా సాయం చేస్తూ ప్రతి ఇంటికీ ఓ పెద్ద దిక్కుగా నిలిచే మంచి మనస్సున్న వ్యక్తిగా అక్కడి ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. చెవిరెడ్డి చేసిన మేలుకు రుణం తీర్చుకోవాలంటే ఆయన బిడ్డను ఎమ్మెల్యేగా చేయడం ఒక్కటే తమకున్న అవకాశం అంటూ పలువురు మహిళలు బహిరంగంగా స్పష్టం చేశారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా దాదాపు 1000 కోట్ల రూపాయలు ఖర్చుతో అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చరిత్ర సృష్టించారన్నారు.