వేదాంతపురంలో చెవిరెడ్డి లక్ష్మీ ఆత్మీయ పలకరింపు
తిరుపతిరూరల్
పల్లెల్లో తిరుగుతూ ప్రజల బాగోగులు తెలుసుకుని తన బిడ్డ మోహిత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సతీమణి చెవిరెడ్డి లక్ష్మీ చేపట్టిన గడప గడపలో ఆత్మీయ పలుకరింపు కార్యక్రమంకు అపూర్వ స్వాగతం లభిస్తొంది. తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీలో గురువారం గడప గడపకు వెళ్లి తన బిడ్డను ఆదరించాలని విజ్నప్తి చేశారు. ముందుగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసిన ఆమె అక్కడి మహిళలకు నమస్కరిస్తూ గడపగడపకు వెళ్లారు. స్థానికులతో మమేకమై జగనన్న ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే చెవిరెడ్డి చేసిన మేలును వివరిస్తూ వారి యోగక్షేమాల గురించి అడగి తెలుసుకున్నారు. తమ ఇంటి ముందుకు వచ్చిన చెవిరెడ్డి లక్ష్మీకి నుదుటన కుంకుమబొట్టు పెట్టి సాదరంగా ఆహ్వానిస్తూ తమ కష్టాలు పంచుకున్నారు. అడగకుండానే అన్నీ ఇచ్చే చెవిరెడ్డి వంటి వ్యక్తి నాయకుడుగా మాకు ఉంటే చాలని చెప్పడంతో ఈ సారి ఎన్నికల్లో చెవిరెడ్డి స్థానంలో ఆయన బిడ్డ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పోటీ చేస్తున్నారని ఆమె అక్కడి ప్రజలకు వివరించారు. మోహిత్ ను మీ ఇంటి బిడ్డగా ఆదరించి విజయం దిశగా నడిపించాలని అభ్యర్థించారు. కాగా చెవిరెడ్డి లక్ష్మీ గడప గడపకు ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి రావడంతో స్థానికులు ఆమెకు పూల వర్షం కురిపిస్తూ గ్రామ శివార్ల నుంచి ఘన స్వాగతం పలికారు. వేదాంతపురం సర్పంచ్ జనార్ధన యాదవ్, చిరంజీవిరెడ్డిలతో పాటు స్థానిక నేతలు పాల్గొన్నారు.