Saturday, November 30, 2024

Creating liberating content

తాజా వార్తలుసమాజమా సిగ్గుపడు…ఈ నకీలీగాళ్లతో…

సమాజమా సిగ్గుపడు…ఈ నకీలీగాళ్లతో…

పీహెచ్డీ అంటే పచ్చడి కూర అనుకుంటున్నారా…
ఫిలాసఫీ అంటే అర్థం పరమార్థం తెలియదు…
పుస్తకం రాస్తే గౌరవ పీహెచ్డీ ఇస్తారట…
ప్రపంచానికే కొత్త భాష్యం పలికిన ఓ మహిళా
సేవ అంటే పరిపూర్ణ అర్థం తెలియదు…
సేవకు గౌరవ పీహెచ్డీ ఇచ్చారట…
మల్లీ అవినీతి అన్నయ్య సఫార్ట్…
మీడియాపై అవగాహన లేకుండా కారు కూతలు
వీరంతా కళామాతల్లి అభివృద్ధి ప్రధాతలు…
అక్కినేని ఆజ్యం పోసాడట… దాసరి దండుగా నిలిచాడట…
చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్న చందంగా…
వీరికి ఓనమాలు తెలిసి తెలియని వృద్ధ జర్నలిస్టు మద్ధతు…
తెరమీదికి మళ్లీ కులం కార్డు
అంటే వీరిది కులహంకారమా… దురహంకారమా…

విజయవాడ:
నవ్విపోదురుగాక నాకేల సిగ్గు అన్న చందంగా నమక,చమక,గమకాలు తెలియక,సపాసా అంటే అర్థం పరమార్థం ఎరుగక, శృతి లయలు అంటే అవగాహన లేకుండానే కళామతల్లిని ఉద్ధరించడానికే తమ జీవితాలను త్యాగం చేస్తున్నామని చందాల రూపంలో దండుకుంటూ దాసరి నారాయణరావు దండుగా నిలిచాడని,అక్కినేని మిక్కిలి సంతోషించాడని గొప్పలు చెప్పుకుంటూ పేద కళాకారుల పొట్టకొడుతూ జీవనం సాగిస్తున్నవీరిని ఏమనాలి, ఇంకేమనాలి.తాళం,రాగం, పల్లవి అంటే కనీస పరిజ్ఞానం లేకుండానే పాటలు పాడిస్తాం, పాడేస్తాం అడ్డొస్తే తొక్కేస్తాం అన్న విధానాలను పెంచి పోసిస్తూ ఓ వైపు కుల బలం ఉందని చెప్పుకుంటూ పబ్బం గడువు కుంటున్న వీరిని చూసి కళామ తల్లి కన్నీరు కార్చుతుంది.ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేశారు కాబట్టి వీరికి గౌరవ పీహెచ్డీ లు ఇచ్చారట.ఇప్పటి వరకు గౌరవ డాక్టరేట్ లు,పద్మ భూషణ్, పద్మ విభూషన్ లు ఇచ్చినట్లు విన్నామే కానీ చదువులతల్లికే కొత్త భాష్యం చెప్పినట్లుగా ఈ గౌరవ పీహెచ్డీ లు ఏమీటని ఉన్నత విద్యావంతులు ఆవేదన తో కుమిలిపోతున్నారు.పీహెచ్డీ కి అర్థం పరమార్థం తెలియక పోగా తప్పును కప్పి పుచ్చు కునే విదంగా కులహంకారము అడ్డుపెట్టుకుని దూరహంకారముతో ఊరు గొప్ప పేరు దిబ్బ అన్న విధాన ఊకదంపుడు మాటలు మాట్లాడుతూ ఉత్తుత్తి హడావుడి చేస్తూ దనవంతులే టార్గెట్ గా చేస్తూ కళామతల్లిని నిలువెత్తున నిలువుదోపిడి చేస్తున్నారని పేద కళాకారులు గుండెలు విలపించేలా మొత్తుకుంటున్నారు.ఇలాంటి దూరాఘాతాలు కళ్లెదుటే కనిపిస్తున్న కనీస వృత్తి ధర్మం గా ఎత్తి చూపకబోగా వారికి దండుగా నిలుస్తున్నారు వృద్ధ జర్నలిస్టులు.చివరికి ఇలాంటి పరిస్థితులు చూసి అసలైన విద్యావంతులు,తమ జీవితాన్ని ఫణంగా పెట్టి ఉన్నత ఆశయాల కోసం కష్టపడి పీహెచ్డీలు పొందిన పట్ట భద్రులు తాము ఇలాంటి దుర్భర పరిస్థితులలో ఉన్నామా అని ఆవేదన చెందుతున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజా వార్తలు

టాప్ న్యూస్

More article