కామవరపుకోట
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక రైతాంగ వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాలపై సిపిఐ కార్యకర్తలు సమరశీల పోరాటాలకు సన్నద్ధం కావాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బండి వెంకటేశ్వర రావు పిలుపునిచ్చారు. సిపిఐ కామవరపు కోట మండల కమిటీ సమావేశం కే కోటలో గురువారం నాడు టీ రావులమ్మ అధ్యక్షతన జరిగింది. సిపిఐ మండల కార్యదర్శి టీవీఎస్ రాజు మండలంలో ఇటీవల పార్టీ నిర్వహించిన కార్యకలాపాలను వివరించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న బండి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో 2014 ముందు వరకు పాలించిన పాలకులు దేశంలో వందలాది సంస్థలను పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేస్తే , మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కార్పొరేట్ మరియు ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నాడని ఆయన ఆరోపించారు. భారతదేశాన్ని ఆర్థికంగా నష్టాలు ఊబిలోకి తీసుకెళ్తూ భారత దేశ రాజ్యాంగాన్ని చిన్నాభిన్నం చేస్తూ మతసామరస్యాన్ని జాతీయ సమైక్యతను లౌకిక వ్యవస్థను నాశనం చేస్తున్నాడని దుయ్య బట్టారు. కామవరపుకోట మండలంలో సిపిఐ మరియు ప్రజాసంఘాల నిర్మాణానికి అభివృద్ధికి పార్టీ మండల కమిటీ సభ్యులు కృషి చేయాలని ఆయన కోరారు. సమావేశంలో సిపిఐ మండల కమిటీ సభ్యులు కంకిపాటి బుచ్చిబాబు మీనుగుల దుర్గారావు, చలమల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.