- రాప్తాడులో ప్రచారాన్ని ప్రారంభించిన తెదేపా నాయకులు
రాప్తాడు:సైకిల్ గుర్తుకు ఓటు వేసి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసి రాష్ట్ర భవిష్యత్తును కాపాడదామని మాజీ మంత్రి పరిటాల సునీత సోదరుడు మండల తెదేపా ఇన్చార్జ్ ధర్మవరపు మురళి ప్రజలను కోరారు . గురువారం మండల కేంద్రంలోని స్థానిక నీలకంటేశ్వర స్వామి దేవాలయంలో తెదేపా నాయకులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు గంగలకుంట గ్రామంలో ఇంటింటికి తిరిగి తెదేపా జనసేన మేనిఫెస్టోని సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు వైకాపా ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు నియోజకవర్గంలో పరిటాల సునీతను అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సహకరించాలని తెదేపా అధికారంలో ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలకు సూచించారు ఎమ్మెల్యే సోదరులు ధనార్జన ధ్యేయంగా నియోజకవర్గాన్ని దోచుకున్నారని మళ్లీ వైకాపా అధికారంలోకి వస్తే నియోజకవర్గం అతలాకుతలమవుతుందని పేర్కొన్నారు సైకిల్ గుర్తుకు ప్రతి ఒక్కరు ఓటు వేసి తెదేపా పార్టీని అధికారులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పంపు కొండప్ప ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు , గంగలకుంట రమణ , గంగలకుంట కిష్ట , సాకే జయరాముడు , గుజ్జల నారాయణస్వామి , సాకే నారాయణస్వామి , మరోరు గోపాల్ , అంపాపురం జయప్ప , డిష్ వెంకటరాముడు గేట్ సత్తి రామునేపల్లి రాము ,చీర్ల వెంకటేష్ సర్పంచ్ ఉజ్జనప్ప , కొత్తపల్లి నారాయణస్వామి , ముత్యాలు, కదిరప్ప, సర్పంచ్ నరేష్ , బాబయ్య , మరూరు నరేష్, స్వర్ణక్క ,ధనలక్ష్మి తదితర తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .