బద్వేల్ :బద్వేల్ పట్టణంలోని సిద్ధవటం రోడ్డు నందు గల ఫూలే సర్కిల్ వద్ద సావిత్రిబాయి పూలే 127 వ వర్ధంతి కార్యక్రమం ఫూలే ఆశయ సాధన సమితి ఛైర్మెన్ గురుమూర్తి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా మునిసిపల్ వైస్ ఛైర్మెన్ యర్రగొల్ల గోపాలస్వామి,యోగివేమన యూనివర్సిటీ పాలకమండలి సభ్యులు కొండపల్లి చిన్న సుబ్బారావు,బద్వేలు పౌరవేదిక ఛేర్మెన్ పెద్దిరెడ్డి సతీష్ రెడ్డి హాజరై సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పూలే ఆశయ సాధన సమితి చైర్మన్ బద్వేల్ గురుమూర్తి మాట్లాడుతూ స్త్రీలు చదువకూడదు అనే ఆనాటి సమాజంలో స్త్రీ విద్య ద్వారానే కుటుంబం,దేశం అభివృద్ది చెందుతుందని తన భర్త మహాత్మ జ్యోతిరావు పూలే వద్ద విద్య నేర్చుకుని భారతదేశం లోనే మొట్టమొదటి అంటరాని బాలికల విద్య కొరకు 1948 పూణేలో తన భర్త ఏర్పాటు చేసి పాఠశాలలో ఉపాధ్యాయురాలు గా స్త్రీ విద్యాభివృద్దికి కృషిచేసిన భారతదేశ ప్రప్రధమ మహిళా ఉపాధ్యాయిని మాతా సావిత్రిబాయి పూలే.తన భర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అడుగుజాడలలో నడుస్తూ అనేక సామాజిక ఉద్యమాలలో పాల్గొని భర్త మరణానంతరం ఆయన ఉద్యమాలను అత్యంత ధైర్య సాహసాలతో కొనసాగించిన ధీశాలి పూలే భార్య సావిత్రిబాయి మహారాష్ట్రలో 1896 లో బొంబాయి నగరంలో వచ్చినటువంటి భయంకరమైన ప్లేగు వ్యాధి గ్రస్తులను ఆసుపత్రులకు తరలిస్తూ వారికి సేవ చేస్తూ ప్లేగు వ్యాధికి గురై 1897 మార్చి 10 న మరణించారు.ఆమె ఆశయాల సాధనకు మనమందరం కృషిచేయాలన్నారు.