ఏపీ స్టేట్ టూరిజం శాఖ డైరెక్టర్ పోకల రామకృష్ణారెడ్డి
కలసపాడు :
ప్రకాశం జిల్లా గిద్దలూరు లోని దాతల సహకారంతో విట్టా శుబ్బరత్నం కళ్యాణ మండపం నందు బేస్తవారం రాత్రి జరిగిన ప్రధమ స్వాతంత్ర సమరయోధులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారత జాతి కోసం అమరత్వం చెందిన రోజు ఫిబ్రవరి 22 వర్ధంతిని వైభవంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగా టీచర్ బి.యస్ నారాయణరెడ్డి సంఘసేవకులు ఆధ్వర్యంలో వైభవముగా ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షులు విశ్రాంత లెక్చరర్ గొటికె రవీంద్రారెడ్డి అధ్యక్షతన సభా కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీ టూరిజం శాఖ రాష్ట్ర డైరెక్టర్ పోకల రామకృష్ణారెడ్డి గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు మాట్లాడుతూ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధులు వీర సింహం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటిష్ సామ్రాజ్య వాదుల ఖబంద హస్తాల నుండి భారతదేశాన్ని విముక్తి చేసేందుకు జరిగిన పోరాటంలో రాయలసీమకు జరిగిన తీవ్ర అన్యాయాలపై కన్నెర చేసిన యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత సైన్యాన్ని కూడగట్టుకొని బ్రిటీష్ వారిపై విరుచుకుపడి తుదకు ఉరికొయ్యను ముద్దాడిన భారత ముద్దుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి లాంటి త్యాగ పురుషులను గిద్దలూరులో బి యస్ నారాయణరెడ్డి ద్వారా గుర్తు చేసుకోవడం ఆనందంగా గర్వంగా ఉందన్నారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి మాట్లాడుతుంటే సభా ప్రాంగణం అందరిలోనూ పౌరుషం తన్నుకొస్తుందన్నారు. స్టేజిమీద, సభలో కూర్చున్న ప్రతి ఒక్కరు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి భారతదేశం కోసం ప్రాణ త్యాగం చేసిన మహోన్నతుడు కనుక ఆయనకు భారతరత్న ఇవ్వాలని ముక్తకంఠంతో సభా ప్రాంగణం అంతా గగ్గోలు పెట్టేవిదంగా స్లొగన్స్ కూడా చేశారు. హెల్త్ అధికారి అభిబ్ ఖాన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వేషధారణలో తెల్లదొరలు ఉరి తీసే కార్యక్రమాన్ని నిర్వహించి సభలో పాల్గొన్న అందరి చేత కంట కన్నీరు పెట్టించారు వేషధారణ అందరిని ఆకర్షించింది. అలాగే చిన్నారులు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ధైర్య సాహసాలకు సంబంధించిన పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి సభను అలరించారు సభలో కూర్చున్న అందరూ కూడా చిన్నారులను పొగడ్తలతో ముంచెత్తారు. పాల్గొన్న వారికి దాతల సహకారంతో అల్పాహారం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో రామకృష్ణ ధ్యాన మందిరం అధ్యక్షులు పూనూరు హనుమంత రెడ్డి, మాగులూరి శ్రీకాంత్, డాక్టర్ చక్రవర్తి, రెడ్డి మల్లారెడ్డి, విశ్రాంత ఆర్మీ కెప్టెన్ గురువు రెడ్డి, అంకన్న ,కవి చదువుల వాడ, మహబూబ్ పీరా, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అభిమానులు పాల్గొన్నారు.